చంద్రబాబుకు కొవిడ్‌ అంటించి హత్య చేయాలన్న ఆలోచనలో సీఎం జగన్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-05-11T09:19:13+05:30 IST

‘‘ధూళిపాళ్ల నరేంద్రను అరెస్టు చేసి తిప్పినట్లు... చంద్రబాబును తిప్పి, కరోనా వైరస్‌ అంటించి, హత్య చేయాలనే ఆలోచనలో సీఎం జగన్‌ ఉన్నట్టు తెలుస్తోంది

చంద్రబాబుకు కొవిడ్‌ అంటించి హత్య చేయాలన్న ఆలోచనలో సీఎం జగన్‌రెడ్డి

ఎమ్మెల్సీ బీటెక్‌ రవి


పులివెందుల టౌన్‌, మే 10: ‘‘ధూళిపాళ్ల నరేంద్రను అరెస్టు చేసి తిప్పినట్లు... చంద్రబాబును తిప్పి, కరోనా వైరస్‌ అంటించి, హత్య చేయాలనే ఆలోచనలో సీఎం జగన్‌ ఉన్నట్టు తెలుస్తోంది. సీఎం జగన్‌పై అటెంప్ట్‌ టు మర్డర్‌ కింద సెక్షన్లు 307, 120 బీ పెట్టి కేస్‌ బుక్‌ చేయాలి’’ అని ఎమ్మెల్సీ బీటెక్‌ రవి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన చేశారు. అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని జరిపిన సమీక్ష సమావేశాల్లో వ్యాక్సినేషన్‌పై జగన్‌, ప్రధాని నిర్లక్ష్య ధోరణిని ఎందుకు ఎండగట్టలేకపోయారని ప్రశ్నించారు. కేబినెట్‌ మంత్రులు వైరస్‌ గురించి చెప్పిన విషయాన్నే ప్రజల్లో అవగాహన కలిగించాలని చెప్పిన ప్రతిపక్ష నేత చంద్రబాబుపై సామాన్యులతో కేసులు పెట్టించి నోటీసులు ఇవ్వడం దిగజారుడుతనమన్నారు.

Updated Date - 2021-05-11T09:19:13+05:30 IST