Abn logo
Oct 30 2020 @ 18:39PM

విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం జగన్‌

Kaakateeya

విశాఖ: విశాఖ ఎయిర్‌పోర్టుకు సీఎం జగన్‌ చేరుకున్నారు. పార్క్‌ హోటల్‌లో జరిగే చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహానికి సీఎం హాజరుకానున్నారు. ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకు విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో పార్క్‌ హోటల్‌కు వెళతారు. నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం ఏడు గంటలకు తిరిగి విమానాశ్రయానికి చేరుకుని విజయవాడ వెళ్లిపోతారు. జగన్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేకు వివాహానికి హాజరవుతారు. సీఎం పెళ్లికి వస్తుండడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. వివాహానికి ముందు నిర్వహించిన వేడుకలో కరణం ధర్మశ్రీ బంధువులతో కలిసి డ్యాన్స్ చేశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ధర్మశ్రీ నృత్యానికి నెటిజన్లు ఫిదా అయ్యారు. 


Advertisement
Advertisement