వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డికి సీఎం జగన్ క్లీన్ చిట్
ABN , First Publish Date - 2021-11-19T21:24:57+05:30 IST
వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డికి సీఎం జగన్ క్లీన్ చిట్
గుంటూరు: వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డికి సీఎం జగన్ క్లీన్ చిట్ ఇచ్చారు. అవినాష్‌రెడ్డి తన చిన్నాన్న కొడుకు అని సీఎం జగన్ అన్నారు. ఒక కన్ను మరో కన్నును ఎందుకు పొడుచుకుంటుందని జగన్ అన్నారు. తమ చిన్నాన్నను ఓడించడానికి తమ ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను లాక్కోని ఓడించారని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఆయన హయాంలోనే ఇదంతా జరిగిందని సీఎం జగన్ తెలిపారు. తమ చిన్నాన్నను ఎవరైనా ఏదైనా చేసి ఉంటే వాళ్ళే చేసి ఉండాలన్నారు. తమ కుటుంబంలోనే చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని సీఎం జగన్ విమర్శించారు.