అరశాతం అప్పు కోసం పాఠశాలలు మూసేస్తారా?

ABN , First Publish Date - 2022-07-07T18:32:05+05:30 IST

‘జగన్‌రెడ్డి కుమార్తెల్లో ఒకరు పారిస్‌లో, ఒకరు లండన్‌లో చదవాలి. కానీ రాష్ట్రంలోని పేద పిల్లలు వాగులు, వంకలు దాటుకుని స్కూలుకు వెళ్లాలా..’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నిలదీశారు. హేతుబద్ధీకరణ పేరిట ఏపీలోని సుమారు 8 వేల ప్రభుత్వ

అరశాతం అప్పు కోసం పాఠశాలలు మూసేస్తారా?

హేతుబద్ధీకరణ పేరిట 8 వేల బడుల మూత.. దీనిపై జనం తిరగబడాలి

జగన్‌ చదువుకోలేదు కాబట్టే..ఇతరులు చదువుకుంటే భరించలేడు

మినీ మహానాడులో చంద్రబాబు 


రాయచోటి, జూలై 6 (ఆంధ్రజ్యోతి): ‘జగన్‌రెడ్డి కుమార్తెల్లో ఒకరు పారిస్‌లో, ఒకరు లండన్‌లో చదవాలి. కానీ రాష్ట్రంలోని పేద పిల్లలు వాగులు, వంకలు దాటుకుని స్కూలుకు వెళ్లాలా..’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నిలదీశారు. హేతుబద్ధీకరణ పేరిట ఏపీలోని సుమారు 8 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తున్నారని.. దీనిపై ప్రజలు తిరగబడాలని పిలుపిచ్చారు. రైతులు వినియోగించే వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం రైతుల మెడలకు ఉరితాళ్లు వేయడమేనని.. దీనిని తెలుగుదేశం అంగీకరించదని తేల్చిచెప్పారు. ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బుధవారం జరిగిన మినీ మహానాడు బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘మేం అధికారంలో ఉన్నప్పుడు మూడు కిలోమీటర్లకు ఒక స్కూల్‌, 5 కిలోమీటర్లకు ఒక హైస్కూల్‌, మండలానికో కాలేజీ ఏర్పాటు చేశాం. నేను తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో ఎంఏ ఎకనామిక్స్‌ చదివాను. వైఎస్‌ జగన్‌ ఎక్కడ చదివారో చెప్పగలరా? ఆయన చదువుకోలేదు కాబట్టే ఇతరులు చదువుకోవడం ఆయన భరించలేడు. కేంద్రం అర్ధశాతం అప్పు ఇచ్చిందని, దాని కోసం ఈ స్కూళ్లు మూసేశారు. అధికారం కోసం పాదయాత్ర పేరుతో రాష్ట్రమంతా తిరిగి ప్రజలకు ముద్దులు పెట్టిన జగన్‌.. ఇప్పుడు పన్నుల పేరుతో పిడుగుద్దులు గుద్దుతున్నారు. మీ ఊర్లలో స్కూళ్లను మూసివేస్తే ఆయా గ్రామాల వైసీపీ నేతలను బహిష్కరించండి’ అని ప్రజలను కోరారు. వారు చేసే పోరాటానికి టీడీపీ అండగా ఉంటుందన్నారు.  

Updated Date - 2022-07-07T18:32:05+05:30 IST