దెబ్బతిన్న బీసీసీఐ, ఎన్‌సీఏ సంబంధాలు!

ABN , First Publish Date - 2020-08-15T09:03:31+05:30 IST

బీసీసీఐ, జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయా? అంటే ఓ బోర్డు అధికారి వ్యాఖ్యలను బట్టి చూస్తే అవి నిజమేననిపిస్తున్నాయి. ఇంతకీ విషయమేమిటంటే..

దెబ్బతిన్న బీసీసీఐ, ఎన్‌సీఏ సంబంధాలు!

ముంబై: బీసీసీఐ, జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయా? అంటే ఓ బోర్డు అధికారి వ్యాఖ్యలను బట్టి చూస్తే అవి నిజమేననిపిస్తున్నాయి. ఇంతకీ విషయమేమిటంటే.. జూన్‌లో లాక్‌డౌన్‌ను పాక్షికంగా ఎత్తివేశాక టీమిండియా సీనియర్‌ ఆటగాడొకరు స్వస్థలంలోని ఓ ప్రైవేట్‌ అకాడమీలో ప్రాక్టీస్‌ ప్రారంభించాడు. ఆ సందర్భంగా గాయపడిన ఆ క్రికెటర్‌ ఎన్‌సీఏ సహాయం కోరాడు. అయితే, ఆ ఆటగాడికి సంబంధించిన పూర్తి వైద్య వివరాలు అకాడమీలో లేకపోవడంతో ఎటువంటి చికిత్స తీసుకోవాలో తెలిపేందుకు ఎన్‌సీఏ నిరాకరించింది. ప్రస్తుతం ఆ క్రికెటర్‌ కోలుకున్నా.. అతడికి చికిత్సకు సంబంధించి ఎన్‌సీఏ స్పందించిన తీరు చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో.. ‘ఓ ఆటగాడి ఫిట్‌నెస్‌, అతడి గాయానికి చికిత్స విషయంలో నిస్సహాయత వ్యక్తం చేయడంతో అసలు ఎన్‌సీఏ పాత్ర ఏమిటి?’ అని బీసీసీఐ అధికారి ఒకరు ఇటీవల జరిగిన వెబినార్‌ తర్వాత ప్రశ్నించాడు. ‘ప్రముఖ క్రికెటర్‌ సమస్యనే పరిష్కరించలేదంటే ఎన్‌సీఏ పనితీరు ఎలా ఉందో అర్థమవుతుంది. ప్రభుత్వ ఆసుపత్రిలా ఉన్న అకాడమీకి వచ్చేందుకు ఎవరూ ఇష్టపడడం లేదని వార్తలు వచ్చినప్పుడే ఎన్‌సీఏ ప్రక్షాళన అవశ్యం అన్న విషయం తెలుస్తోంది’ అని ఆ అధికారి వ్యక్తం చేశాడు.

Updated Date - 2020-08-15T09:03:31+05:30 IST