Advertisement
Advertisement
Abn logo
Advertisement

గుంటూరులో ఫాస్టర్ల మధ్య గొడవ

గుంటూరు: నగరంలో ఫాస్టర్ల మధ్య గొడవలు ఆగడంలేదు. గత ఆదివారం వెస్ట్ ప్యారిస్ చర్చిలో గొడవ జరగ్గా.. ఈ ఆదివారం ఈస్ట్ ప్యారిస్‌లో గొడవ జరిగింది. పాత బస్టాండ్ సెంటర్‌లో ఉన్న ఈస్టు ప్యారిస్ చర్చిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కొంతకాలంగా గుంటూరులో ఏఈఎల్సీలు ఆధిపత్యం కోసం రెండు వర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది. తాజాగా రెండు వర్గాల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. దీంతో ప్రతి ఆదివారం ప్రార్థనల సమయంలో సంఘపెద్దలు, సంఘస్థుల మధ్య వాగ్వాదం జరుగుతోంది.

Advertisement
Advertisement