ములుగు: రామప్ప ఆలయాన్ని సీజేఐ ఎన్వీ రమణ సందర్శించారు. రామప్ప ఆలయంలో ఎన్వీ రమణ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ శిల్ప సౌందర్యాన్ని తిలకించారు. ఆ తర్వాత రామప్ప సరస్సును సందర్శిస్తారు. అక్కడి నుంచి హనుమకొండకు చేరుకొని నిట్ క్యాంప్‌సలోని గెస్ట్‌హౌజ్‌లో బస చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విందుకు హాజరవుతారు.
ఆదివారం ఉదయం భద్రకాళి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఉదయం 9.30 గంటలకు జిల్లా కోర్టు ఆవరణలో నూతనంగా నిర్మించిన పది కోర్టుల భవన సముదాయానికి ప్రారంభోత్సవం చేస్తారు. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్‌కు తిరిగి వెళతారు. సీజేఐ రాక సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేశారు.