వాగులో కొట్టుకుపోయిన కారు

ABN , First Publish Date - 2020-07-11T08:35:13+05:30 IST

ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలం చిన్నబీరవల్లి గ్రామశివారులోని వాగులో కారు కొటుకుపోగా, అందులోని ..

వాగులో కొట్టుకుపోయిన కారు

క్షేమంగా బయటపడిన నలుగురు 

ఖమ్మం జిల్లా చిన్నబీరవల్లిలో ఘటన


బోనకల్‌, జూలై 10:   ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలం చిన్నబీరవల్లి గ్రామశివారులోని వాగులో కారు కొటుకుపోగా, అందులోని నలుగురు సురక్షితంగా బయటపడ్డారు.   గురువారం  రాత్రి కురిసిన వర్షంతో ఈ వాగు ఉప్పొంగింది. వాగుపై తక్కువ ఎత్తులో వంతెన ఉండటంతో నీరు దానిపై నుంచి ప్రవహిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం మధిర నుంచి ఖమ్మం వైపునకు కారులో వెళుతున్న నలుగురు  ప్రవాహం తక్కువగా ఉందని భావించి అవతలికి దాటేందుకు ప్రయత్నించారు.


కొంతదూరం వెళ్లిన తర్వాత  కారు కొట్టుకుపోతుండగా డోర్లు తెరచి నీటిలోకి దూకారు. వీరిలో ఇద్దరు ఒడ్డుకు చేరారు. మరో ఇద్దరు కొట్టుకుపోతుండగా.. అక్కడే ఉన్న రజక సంక్షేమ సంఘ జిల్లా డైరెక్టర్‌ తమ్మారపు బ్రహ్మయ్య, మత్స్యకారుడు అశోక్‌ సురక్షితంగా వారిని ఒడ్డుకు చేర్చారు. కారు వాగులో ఉన్న తుమ్మచెట్టుకు తగిలి ఆగింది.  రోడ్డుపై వాగు నీరు పది అడుగుల ఎత్తు మేరకు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచి పోయాయి. 

Updated Date - 2020-07-11T08:35:13+05:30 IST