సీఐ నాగేశ్వరరావు కేసులో కీలక ఆధారాలు సేకరించిన సిట్

ABN , First Publish Date - 2022-07-12T16:46:56+05:30 IST

సీఐ నాగేశ్వరరావు కేసులో సిట్ కీలక ఆధారాలు సేకరించింది. ప్రాథమిక దర్యాప్తులో నేరం రుజువైందని సిట్ తేల్చింది.

సీఐ నాగేశ్వరరావు కేసులో కీలక ఆధారాలు సేకరించిన సిట్

Hyderabad : సీఐ నాగేశ్వరరావు కేసులో సిట్ కీలక ఆధారాలు సేకరించింది. ప్రాథమిక దర్యాప్తులో నేరం రుజువైందని సిట్ తేల్చింది. కిడ్నాప్ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అత్యాచారం నుంచి ఇబ్రహీంపట్నం రోడ్డుప్రమాదం వరకూ ఆధారాలు సేకరిస్తున్నారు. బాధితురాలి మెడికల్ టెస్ట్ కేసులో ఈ ఆధారాలే కీలకం కానున్నాయి. టవర్ లొకేషన్‌ ట్రేస్ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది. సెటిల్‌మెంట్లు, వసూళ్లు, బెదిరింపుల ఆరోపణలపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే నాగేశ్వరరావుకు 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు.

Updated Date - 2022-07-12T16:46:56+05:30 IST