నలుగురు ఎమ్మెల్యేలను అందించిన చోడవరం

ABN , First Publish Date - 2021-02-08T08:26:45+05:30 IST

పంచాయతీలో వార్డు మెంబర్‌, సర్పంచ్‌ పదవులతో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన పలువురు అనంతర కాలంలో ఎంపీ, ఎమ్మెల్యే, జిల్లా పరిషత్‌ చైర్మన్లుగా ఎన్నికయ్యారు.

నలుగురు ఎమ్మెల్యేలను అందించిన చోడవరం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి) : పంచాయతీలో వార్డు మెంబర్‌, సర్పంచ్‌ పదవులతో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన పలువురు అనంతర కాలంలో ఎంపీ, ఎమ్మెల్యే, జిల్లా పరిషత్‌ చైర్మన్లుగా ఎన్నికయ్యారు. కానీ ఒకే పంచాయతీ నుంచి సర్పంచ్‌గా ఎన్నికైన ముగ్గురు వ్యక్తులు అనంతరం కాలంలో ఎమ్మెల్యేలు కావడం విశేషం. ఈ పంచాయతీకే చెందిన ఒక వార్డు సభ్యుడు ఎమ్మెల్యే... మంత్రి కూడా అయ్యారు. ఇటువంటి అరుదైన ఘనతను విశాఖపట్నం జిల్లాలోని చోడవరం పంచాయతీ దక్కించుకుంది. 1939 నుంచి 1952 వరకు చోడవరం గ్రామ సర్పంచ్‌గా పనిచేసిన కందర్ప వెంకట రామేశం.. 1952లో అప్పటి ఉమ్మడి మద్రాస్‌ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కృషికార్‌ లోక్‌ పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. 1981లో సర్పంచ్‌గా గెలిచిన గూనూరు ఎర్రునాయుడు (మిలట్రీ నాయుడు ) 1983 ఎన్నికల్లో తెలుగుదేశం తరపున ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచారు. ఆపై మరో రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1995 నుంచి 2001 వరకు గ్రామ సర్పంచ్‌గా ఉన్న  కేఎ్‌సఎన్‌ఎస్‌ రాజు 2009, 2014 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. చోడవరం పంచాయతీ శివారు పీఎస్‌ పేట నుంచి వార్డు సభ్యునిగా గెలుపొందిన బలిరెడ్డి సత్యారావు...1989, 1999 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. సత్యారావు మంత్రి పదవి కూడా చేపట్టారు.                                                                                   - చోడవరఖిం

Updated Date - 2021-02-08T08:26:45+05:30 IST