చాక్లెట్‌ కేక్‌

ABN , First Publish Date - 2021-12-22T17:43:46+05:30 IST

గోధుమ పిండి- కప్పు, కొకొ పౌడర్‌ - ఆరు స్పూన్లు, బాదం పాలు- పావు కప్పు, చక్కెర - పావు కప్పు, ఉప్పు- చిటికెడు, చల్లని నీళ్లు - కప్పు, సన్‌ఫ్లవర్‌ నూనె- రెండు స్పూన్లు, బేకింగ్‌ పౌడర్‌ - స్పూను, నిమ్మరసం- స్పూను.

చాక్లెట్‌ కేక్‌

కావలసిన పదార్థాలు: గోధుమ పిండి- కప్పు, కొకొ పౌడర్‌ - ఆరు స్పూన్లు, బాదం పాలు- పావు కప్పు, చక్కెర - పావు కప్పు, ఉప్పు- చిటికెడు, చల్లని నీళ్లు - కప్పు, సన్‌ఫ్లవర్‌ నూనె- రెండు స్పూన్లు, బేకింగ్‌ పౌడర్‌ - స్పూను, నిమ్మరసం- స్పూను.


తయారుచేసే విధానం: బేకింగ్‌ పాన్‌ లోపల భాగమంతా నూనె రాయాలి. ఓ గిన్నెలో గోధుమ పిండి, ఉప్పు కలిపి పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలో చక్కెర, నీళ్లు వేసి బాగా కలపాలి. చక్కెర అంతా కరిగాక నూనెను కూడా వేసి మళ్లీ కలపాలి. ఆ తరవాత నిమ్మరసం జతచేయాలి. ఇందులోనే గోధుమ పిండి, బేకింగ్‌ పౌడర్‌ వేసి అంతా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని బేకింగ్‌ పాన్‌లో వేసి ఉడికిస్తే కేక్‌గా మారుతుంది. ఓ చిన్న గిన్నెలో నూనె, బాదం పాలు, చక్కెర వేసి వేడిచేయాలి. చక్కెరంతా కరిగాక కొకొ పౌడర్‌ని కలపాలి. అంతా కలిశాక స్టవ్‌ కట్టేయాలి. ఈ వేడి ద్రవాన్ని కేక్‌ మీద, అంచుల మీద పోయాలి. చల్లారాక ఫ్రిజ్‌లో రెండు గంటలు పెడితే చాక్లెట్‌ కేక్‌ రెడీ.

Updated Date - 2021-12-22T17:43:46+05:30 IST