ఒక్కసారిగా పడిపోయిన టమాటా ధరలు

ABN , First Publish Date - 2021-12-16T23:43:00+05:30 IST

నిన్న, మొన్నటి వరకు టమాటా ధరలు ఆకాశాన్ని తాకాయి. టమాటా రైతుకు లాభాల పంట పండింది. అయితే ఇప్పుడు టమాటా ధరలు అకస్మాత్తుగా పడిపోయి రైతన్న ఆక్రోశాన్ని...

ఒక్కసారిగా పడిపోయిన టమాటా ధరలు

చిత్తూరు: నిన్న, మొన్నటి వరకు టమాటా ధరలు ఆకాశాన్ని తాకాయి. టమాటా రైతుకు లాభాల పంట పండింది. అయితే ఇప్పుడు టమాటా ధరలు అకస్మాత్తుగా పడిపోయి రైతన్న ఆక్రోశాన్ని మిగిల్చింది. ధరలు తగ్గడంతో సామాన్యులకు మాత్రం కొంత ఊరట కలిగిస్తోంది. చిత్తూరు జిల్లా మదనపల్లి పీలేరు, వాయల్పాడు, పలమనేరు, కుప్పం, పుంగనూరు ప్రాంతాల్లో టమాటా ఎక్కువగా పండుతుంది. ఈ మార్కెట్లలో కిలో టమాటా రూ.130 వరకు రికార్డ్ స్థాయిలో ధర పలకగా నేడు కిలో రూ.40, రూ.50 మాత్రమే పలుకుతోంది. చిత్తూరు జిల్లాలో మదనపల్లె మార్కెట్‌లోనే ఎక్కువ టమాటా ఎగుమతులు జరుగుతూ ఉంటాయి. 



Updated Date - 2021-12-16T23:43:00+05:30 IST