CM YS Jagan హామీ ఇచ్చారు.. ధన్యవాదాలు : చిరంజీవి

ABN , First Publish Date - 2022-02-10T19:21:44+05:30 IST

మొత్తానికి ఏపీ ప్రభుత్వం వర్సెస్ సినీ ఇండస్ట్రీ మధ్య కొద్ది రోజులుగా తలెత్తిన సంక్షోభానికి మొత్తానికి నేటితో తెరపడినట్టే అనిపిస్తోంది.

CM YS Jagan హామీ ఇచ్చారు.. ధన్యవాదాలు : చిరంజీవి

అమరావతి : మొత్తానికి ఏపీ ప్రభుత్వం వర్సెస్ సినీ ఇండస్ట్రీ మధ్య కొద్ది రోజులుగా తలెత్తిన సంక్షోభానికి మొత్తానికి నేటితో తెరపడినట్టే అనిపిస్తోంది. సీఎం జగన్‌తో భేటీ అనంతరం మెగాస్టార్ చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ సంక్షోభానికి నేటితో శుభంకార్డు పడిందని భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల చివరి వారం నాటికి జీవో విడుదల చేసే అవకాశం ఉందన్నారు. 5వ షోకు సైతం జగన్ ఆమోదం తెలిపారన్నారు. చిన్న సినిమాలను దృష్టిలో పెట్టుకుని సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని చిరంజీవి పేర్కొన్నారు. ఇండస్ట్రీ సమస్యలపై కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. సినీ పరిశ్రమకు అండగా ఉంటానని సీఎం హామీ ఇచ్చారన్నారు. సినీ పరిశ్రమ తరపున ఏపీ సీఎంకు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు.


Updated Date - 2022-02-10T19:21:44+05:30 IST