అమరావతి : ఏపీకి ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) వచ్చారు... పోయారని మాజీ మంత్రి చినరాజప్ప(Chinarajappa) పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే అచ్చెన్నాయుడి(Atchennaidu)ని అవమానించిందన్నారు. ఏపీ(AP)కి సంబంధించిన హామీలను ప్రధాని ప్రస్తావించలేదన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో(President elections) ఏపీ మద్దతు కీలకమైనప్పటికీ.. వాళ్లు అడగక ముందే సీఎం జగన్(CM Jagan) మద్దతు ప్రకటించారన్నారు. దీంతో కేంద్రం ఏపీని ఏమాత్రం పట్టించుకోవడం లేదని చినరాజప్ప పేర్కొన్నారు.