తెలంగాణ సోనాకు బ్రాండ్‌

ABN , First Publish Date - 2020-08-15T10:26:46+05:30 IST

: తెలంగాణ సోనా సన్న బియ్యం రకం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ..

తెలంగాణ సోనాకు బ్రాండ్‌

 ఐఎ్‌సబీతో ఒప్పందం 


హైదరాబాద్‌/రాజేంద్రనగర్‌, ఆగస్టు14(ఆంధ్రజ్యోతి): తెలంగాణ సోనా సన్న బియ్యం రకం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురానున్నదని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ బి.జనార్థన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ సోనా(ఆర్‌ఎన్‌ఆర్‌15048)కి బ్రాండ్‌ ఇమేజ్‌ కల్పించేందుకు ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినె్‌సతో తెలంగాణ ప్రభుత్వం, వ్యవసాయ యూనివర్శిటీ  శుక్రవారం  వర్చువల్‌ విధానంలో  అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. సీఏం కేసీఆర్‌ నిర్ణయాలతో  వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకతల్లో  తెలంగాణ మిగులు రాష్ట్రంగా అవతరించిందని జనార్ధన్‌రెడ్డి అన్నారు.


ఇప్పుడు ఆ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ కల్పించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ప్రభుత్వ సహకారం, అందరి కృషితోనే వ్యవసాయ విశ్వవిద్యాలయం నేడు దేశంలో మూడో స్థానంలో నిలిచిందని, దక్షిణ భారత దేశంలో తొలి స్థానంలో  ఉన్నదని వర్శిటీ ఉపకులపతి డాక్టర్‌  వి.ప్రవీణ్‌రావు అన్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థలో గ్రామీణ సమాజం పాత్ర చాల కీలకమని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినె్‌స(ఐఎ్‌సబి) ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ డి.వి.ఆర్‌. శేషాధ్రి అన్నారు. ఈ ఒప్పందం వల్ల రైతాంగానికి మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిష్ట్రార్‌ డాక్టర్‌ ఎస్‌.సుధీర్‌కుమార్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ ఎక్స్‌టెన్షన్‌ డాక్టర్‌ ఆనంద్‌సింగ్‌, ఐఎ్‌సబి ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-15T10:26:46+05:30 IST