శ్రీవారి సేవలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

ABN , First Publish Date - 2022-10-08T10:00:27+05:30 IST

శ్రీవారి సేవలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

శ్రీవారి సేవలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

తిరుమల, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా తిరుమల వేంకటేశ్వరస్వామిని శుక్రవారం దర్శించుకున్నారు. వేకువజామున అభిషేక సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయక మండపంలో ఆయనకు వేదపండితులు ఆశీర్వాదం, ఈవో ధర్మారెడ్డి లడ్డూప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జయసూర్య, జస్టిస్‌ వి.శ్రీనివాస్‌, జస్టిస్‌ దుర్గాప్రసాదరావు, ఢిల్లీ హైకోర్టు జస్టిస్‌ స్వర్ణకాంత్‌ మిశ్రా శుక్రవారం శ్రీవారిని దర్శించుకున్నారు.


Updated Date - 2022-10-08T10:00:27+05:30 IST