Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

అన్నానేటివ్‌ కోడి కారమ్‌ చిప్స్‌

అన్నానేటివ్‌ కోడి కారమ్‌ చిప్స్‌

కావాల్సిన పదార్థాలు: నానబెట్టడం మరియు ఫ్రై కోసం...

చికెన్‌ బ్రెస్ట్‌ (సన్నటి ముక్కలు)-200 గ్రా, జొన్నపిండి - 20 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌- 5 గ్రా, కారం- 15 గ్రా, గరం మసాలా - 5 గ్రా, జీలకర్ర పొడి- 5గ్రా, ఉప్పు- తగినంత


కోడికారం పొడి కోసం...

చాట్‌ మసాలా - 25 గ్రా, ధనియాల పొడి - 25 గ్రా, జీలకర్ర పొడి- 25 గ్రా, కారం పొడి- 25 గ్రా


తయారీ విధానం: ఓ గిన్నెలో  నీరు తీసుకుని, మారినేషన్‌ కోసం  పైన వెల్లడించిన పదార్థాలన్నీ తీసుకుని మెత్తగా ముద్దలా చేసుకోవాలి. ఈ ముద్దలో చికెన్‌ కూడా కలిపి 10 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇప్పుడు ఓ కడాయిలో నూనె తీసుకుని ఈ చికెన్‌ ముక్కలను వేసి బంగారు వర్ణం వచ్చే వరకూ వేయించాలి. కోడికారం కోసం వెల్లడించిన పదార్థాలన్నీ తీసుకుని  గ్రైండింగ్‌  చేయాలి. ఈ కారాన్ని వేయించిన చికెన్‌ ముక్కలపై చల్లుకుని, వేయించిన కరివేపాకు జోడించి సర్వ్‌ చేసుకోవాలి.


ఇస్మాయిల్‌ 

ఎగ్జిక్యూటివ్‌ చెఫ్‌ 

అన్నానేటివ్‌ సౌత్‌ ఇండియన్‌ ఫ్యూజన్‌ రెస్టారెంట్‌ 

సైనిక్‌పురి, హైదరాబాద్‌

కబాబ్స్‌కబాబ్స్‌మటన్‌ రోస్ట్‌మటన్‌ రోస్ట్‌మటన్‌ కట్‌లెట్స్‌మటన్‌ కట్‌లెట్స్‌వర్క్యూ లుక్మేవర్క్యూ లుక్మేటర్పెండో పెప్పర్టర్పెండో పెప్పర్భార్వాన్‌ టంగ్డిభార్వాన్‌ టంగ్డిగిలౌటి కబాబ్‌ విత్‌ ఉల్టా తవ్వా కా పరోటాగిలౌటి కబాబ్‌ విత్‌ ఉల్టా తవ్వా కా పరోటాటిక్కాటిక్కామంచూరియామంచూరియాఫిష్‌ కేక్‌ఫిష్‌ కేక్‌
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.