Abn logo

తెలంగాణ చికెన్‌ కూర

కావలసినవి: చికెన్‌ - ఒక కేజీ, ఉల్లిపాయలు - మూడు, పచ్చిమిర్చి - మూడు, కరివేపాకు - రెండు రెబ్బలు, కొత్తిమీర తరుగు - పావు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒకటిన్నర టీస్పూన్‌, ధనియాల పొడి - రెండు టేబుల్‌స్పూన్లు, గరంమసాలా పొడి - అర టీస్పూన్‌, పసుపు - పావు టీస్పూన్‌, కారం - రెండున్నర టీస్పూన్లు, కొబ్బరిపొడి - మూడు టేబుల్‌స్పూన్లు, గసగసాలు - 2 టీస్పూన్లు, టొమాటోలు - 2, ఉప్పు - తగినంత, నూనె - నాలుగు టేబుల్‌స్పూన్లు.


తయారీ: చికెన్‌ ముక్కలు కడిగి జల్లెడలో వేసి పెట్టాలి. గసాలు కొద్దిగా వేగించి పొడి చేసి పెట్టుకోవాలి. మందపాటి గిన్నె లేదా పాన్‌లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి. ఇందులో పసుపు, కారం పొడి, కరివేపాకు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కొద్దిగా వేగించాలి.తరువాత చికెన్‌ ముక్కలు, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. ముక్కలు నూనెలో మగ్గి నీరంతా ఇగిరిపోయిన తర్వాత కొబ్బరి పొడి, గసగసాల పొడి, సన్నగా తరిగిన టొమాటో ముక్కలు వేసి కలపాలి. ఒక కప్పు నీళ్లు పోసి కలిపి మూతపెట్టి ఉడకనివ్వాలి. ముక్కలు ఉడికి నూనె పైకి తేలుతున్నప్పుడు గరం మసాలా పొడి, కొత్తిమీర వేసి కలిపి దింపాలి.


పోషక విలువలు 100గ్రా.లలో

చికెన్

ప్రొటీన్‌ - 53.4 గ్రా

క్యాలరీలు - 284

ఫ్యాట్‌ - 6.2 గ్రా

బొమ్మిడాయిలు పాలకూరబోటీ చారు / దప్పడంకాళ్ల కూర / పాయమామిడికాయతో చందమామ చేపల పులుసుషిడోల్‌ చేప కర్రీఫిష్‌ కర్రీచికెన్‌ మసాలా కర్రీతలకాయ కూరచికెన్‌ రోస్ట్‌కొబ్బరిపాల చికెన్‌
Advertisement
Advertisement