అన్నం తినే సమయంలో వర్షం పడుతోందని.. హాల్లోకి వెళ్లి కిటికీ దగ్గర కూర్చున్న విద్యార్థులు.. కాసేపటికే వారికి ఎదురైన ఊహించని ఘటన!

ABN , First Publish Date - 2021-10-05T19:13:50+05:30 IST

విధిని రాతను ఎవరూ..

అన్నం తినే సమయంలో వర్షం పడుతోందని.. హాల్లోకి వెళ్లి కిటికీ దగ్గర కూర్చున్న విద్యార్థులు.. కాసేపటికే వారికి ఎదురైన ఊహించని ఘటన!

ఇంటర్‌నెట్‌డెస్క్: విధిని రాతను ఎవరూ మార్చలేరనడానికి ఈ సంఘటనే ఓ ఉదాహరణ. అన్నం తినే సమయంలో వర్షం పడుతోందని డైనింగ్ హాల్లోకి వెళ్లిన విద్యార్థులకు.. కాసేపటికే వారికి ఓ షాకింగ్ ఘటన ఎదురైంది. ఈ సంఘటనలో ఓ పిల్లాడు అక్కడిక్కడే మృత్యువాత పడగా.. మరో ముగ్గురు పిల్లలు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. అసలు విషయంలోకి వస్తే..


చత్తీస్‌గఢ్‌లోని భిలాస్‌పూర్‌‌ జిల్లా మాచ్‌ఖండ్‌ గ్రామంలో అయూబ్ ఖాన్ సెకండరీ స్కూల్ ఉంది. కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యార్థులు పాఠశాలలకు వెళ్తున్నారు. ఎప్పటిలాగే సోమవారం కూడా విద్యార్థులు మధ్యాహ్న భోజనం కోసం చెట్లకిందకు వెళ్లారు. భోజనం చేస్తుండగా వర్షం పడడం మొదలైంది. దీంతో విద్యార్థులందరూ ఓ హాల్‌లోకి వెళ్లారు. కిటికీ దగ్గర కూర్చున్న కాసేపటికే విద్యార్థులకు ఓ షాకింగ్ ఘటన ఎదురైంది. కిటీకి దగ్గర పిడుగుపడడంతో.. 6వ తరగతి విద్యార్థి శివమ్‌(11) అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. మరోపదిమంది విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. క్షతగాత్రులైన విద్యార్థులలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ షాకింగ్ ఘటన చూసి మిగతా పిల్లలందరూ ఉలిక్కిపడ్డారు. సంఘటన అనంతరం విద్యార్థులను ఇంటికి పంపించేశారు.


11ఏళ్ల శివమ్ మరణవార్త వినగానే అతడి తల్లి గుండెలు విలసేలా రోదించింది. 2011లో విద్యుత్ ప్రవాహం కారణంగానే శివమ్ తండ్రి శేషనారాయణ మరణించాడు. శివమ్‌కు ఒక అన్న, చెల్లెలు ఉన్నారు. అన్నయ్య సంజు సాహు కూడా అదే పాఠశాలలో 11 వ తరగతి చదువుతున్నాడు. సోదరి పేరు నీతా సాహు. శివమ్ మరణం పట్ల తోబుట్టువులు ఇద్దరూ తీవ్రమైన ఆవేదన చెందుతున్నారు. సంఘటన పట్ల ముఖ్యమంత్రి భూపేష్ భాగల్ తీవ్రమైన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పిల్లలకు మెరుగైన వైద్యం అందిచాలని కోరారు. మృత్యువాత పడ్డ శివమ్ కుటుంబానికి రూ.4లక్షల పరిహారం అందజేస్తామని కలెక్టర్ శరన్ష్ మిట్టర్ తెలిపారు.




Updated Date - 2021-10-05T19:13:50+05:30 IST