జోరుకు కళ్లెం

ABN , First Publish Date - 2022-08-02T09:04:41+05:30 IST

చెస్‌ ఒలింపియాడ్‌లో మూడ్రోజులుగా వరుస విజయాలు నమోదు చేస్తున్న భారత జట్లకు నాలుగో రౌండ్‌లో ఎదురుగాలి వీచింది.

జోరుకు కళ్లెం

4వ రౌండ్‌లో ఓడిన భారత్‌-3 జట్లు

డ్రాలతో సరిపెట్టుకున్న తెలుగు జీఎంలు

చెన్నై (ఆంధ్రజ్యోతి): చెస్‌ ఒలింపియాడ్‌లో మూడ్రోజులుగా వరుస విజయాలు నమోదు చేస్తున్న భారత జట్లకు నాలుగో రౌండ్‌లో ఎదురుగాలి వీచింది. పురుషుల విభాగంలో స్పెయిన్‌ 2.5-1.5తో, మహిళల కేటగిరీలో జార్జియా 3-1తో భారత్‌-3 జట్లకు షాకిచ్చాయి.  గంగూలీ సూర్య శేఖర్‌, సేతురామన్‌, కార్తికేయన్‌ మురళి తమ గేమ్‌లను డ్రా చేసుకోగా, ఆఖరి గేమ్‌లో అంటన్‌ డేవిడ్‌ (స్పెయిన్‌) చేతిలో అభిజిత్‌ గుప్తా ఓడడంతో పరాజయం తప్పలేదు. అమ్మాయిల్లో భారత్‌-3 జట్టు నుంచి నందిదా మాత్రమే విజయం సాధించగా ఇషా, సాహితి, ప్రత్యూష పరాజయం పాలవడంతో టోర్నీలో ఆ టీమ్‌కు తొలి ఓటమి ఎదురైంది.


ఇక, ఫ్రాన్స్‌తో తలపడిన భారత పురుషుల జట్టు 2-2తో టోర్నీలో తొలి డ్రాను నమోదు చేసింది.  హరికృష్ణ సారథ్యంలోని భారత జట్టు డ్రాతో సరిపెట్టుకుంది. హరికృష్ణ, అర్జున్‌, విదిత్‌ సంతోష్‌, నారాయణ్‌ అందరూ తమ గేమ్‌లను డ్రాగానే ముగించారు. భారత్‌-2 పురుషుల జట్టు 3-1తో ఇటలీని చిత్తు చేసింది. గుకేష్‌, నిహాల్‌ సరిన్‌ గెలవగా, ప్రజ్ఞానంద, సద్వానీ రౌనక్‌ తమ గేమ్‌లను డ్రా చేసుకున్నారు. కోనేరు హంపి నేతృత్వంలోని అమ్మాయిల భారత జట్టు 2.5-1.5తో హంగేరిపై గెలిచింది. భారత్‌-2 టీమ్‌ 2.5-1.5తో ఎస్తోనియాపై గెలుపొందింది. 


నేటి భారత షెడ్యూల్‌ (సోనీ నెట్‌వర్క్‌లో లైవ్‌)

వెయిట్‌ లిఫ్టింగ్‌: పూనమ్‌ యాదవ్‌ (మహిళల 76 కిలోల స్వర్ణ పోరు- మ. 2 గం), వికాస్‌ ఠాకూర్‌ (పురుషుల 96 కి. పసిడి పోరు- సా. 6.30 నుంచి), ఉషా భన్నౌర్‌ (మహిళల 87 కి. స్వర్ణ పోరు- రాత్రి 11 గం); స్విమ్మింగ్‌: శ్రీహరి నటరాజ్‌ (పురుషుల 200 మీ. బ్యాట్‌ స్ట్రోక్‌ హీట్స్‌ - మ. 3 గం).. అద్వైత్‌, కుశాగ్ర రావత్‌ (పురుషుల 1500 మీ. ఫ్రీస్టైల్‌ హీట్స్‌- సా. 4.10 నుంచి); లాన్‌ బౌల్స్‌: మహిళల ఫోర్‌ ఫైనల్‌ భారత్‌-దక్షిణాఫ్రికా (స్వర్ణ పోరు సా. 4.15 గం), పెయిర్‌ (రౌండ్‌-1- మ. 1 గం), ట్రిపుల్‌ (రౌండ్‌-1- మ. 1 గం), పురుషుల సింగిల్స్‌ (రౌండ్‌-1-సా. 4.15 గం), ఫోర్‌ (రౌండ్‌-1- రా. 8.45 గం), ట్రిపుల్‌ (రౌండ్‌-2-రా. 8.45 గం); ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌: సత్యజిత్‌ మొండల్‌ (పురుషుల వాల్ట్‌ ఫైనల్‌- సా. 5.30 గం.), సైఫ్‌ తంబోలి (పురుషుల ప్యారలల్‌ బార్స్‌ ఫైనల్‌- సా. 6.35 గం); బాక్సింగ్‌: రోహిత్‌ టోకాస్‌ (రౌండ్‌-16- వెల్టర్‌ వెయిట్‌ 63.5 కిలోలు- రాత్రి 11.35 గం): హాకీ: భారత్‌ గీ ఇంగ్లండ్‌ (మహిళల పూల్‌-ఎ- సా. 6.30 గం); స్క్వాష్‌: మహిళల సింగిల్స్‌ సెమీస్‌ (సునయన కురువిల్లా- రాత్రి 8.30 గం), పురుషుల సెమీస్‌ (సౌరవ్‌ ఘోశాల్‌- రా. 9.15 గం); అథ్లెటిక్స్‌: పురుషుల లాంగ్‌ జంప్‌ క్వాలిఫయింగ్‌ (శ్రీ శంకర్‌, మహ్మద్‌ అనీస్‌-మ. 2.30 గం), హైజంప్‌ క్వాలిఫయింగ్‌ (తేజస్విని శంకర్‌- రా. 12 గం), మహిళల డిస్కస్‌త్రో ఫైనల్‌ (సీమా పూనియా, నవ్‌జీత్‌ కౌర్‌- రా. 12.52 గం)

Updated Date - 2022-08-02T09:04:41+05:30 IST