చట్‌పట్‌ చాక్లెట్‌ కేక్‌

ABN , First Publish Date - 2022-03-19T19:40:16+05:30 IST

తక్కువ తిన్నా ఎక్కువ తిన్నట్టు అనిపించే స్నాక్స్‌ కొన్ని ఉంటాయి. అలాంటి కోవకు చెందినదే చట్‌పట్‌ చాక్లెట్‌! ఇల్లంతా స్నేహితులు, బంధువులతో నిండి

చట్‌పట్‌ చాక్లెట్‌ కేక్‌

తక్కువ తిన్నా ఎక్కువ తిన్నట్టు అనిపించే స్నాక్స్‌ కొన్ని ఉంటాయి. అలాంటి కోవకు చెందినదే చట్‌పట్‌ చాక్లెట్‌! ఇల్లంతా స్నేహితులు, బంధువులతో నిండి ఉన్నప్పుడు, అందరికీ సరిపడేలా స్నాక్స్‌ ఎలా ప్రిపేర్‌ చేయాలనే కంగారు అవసరం లేదు. చిటికెలో తయారయ్యే ఈ కేక్‌ను అందిస్తే వాళ్ల మనసులు గెలుచుకోవచ్చు.


కావలసిన పదార్థాలు: మైదా - 180 గ్రాములు, కోకో పౌడర్‌: 4 టేబుల్‌ స్పూన్లు,  బేకింగ్‌ పౌడర్‌: ఒకటి పావు టీ స్పూను, బేకింగ్‌ సోడా - అర టీస్పూను, పెరుగు - అర కప్పు, చక్కెర - అర కప్పు, వెనిల్లా ఎసెన్స్‌ - ఒక టీ స్పూను, పాలు - 100 ఎంఎల్‌.


తయారీ విధానం: ఒక గిన్నెలో పెరుగు, చక్కెర, వెనిలా ఎసెన్స్‌ వేసి బాగా కలుపుకోవాలి. మైదా పొడి, బేకింగ్‌ పౌడర్‌, బేకింగ్‌ సోడా, ఉప్పు, కోకో పౌడర్‌లను జల్లించి, పెరుగు మిశ్రమంలో కలుపుకోవాలి. చివర్లో పాలను చేర్చి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. కేక్‌ టిన్‌కు నూనె పూసి, మైదా పిండి చల్లి టిన్‌ మొత్తం పిండి అంటుకునేలా తిప్పాలి. తర్వాత టిన్‌లో, కలిపి పెట్టుకున్న కేక్‌ మిశ్రమాన్ని నింపాలి.  స్టవ్‌ మీద కుక్కర్‌ ఉంచి, గిన్నెల స్టాండ్‌ను ఉంచి, స్టాండ్‌  మునిగేవరకూ ఉప్పు నింపుకోవాలి. కుక్కర్‌ వేడెక్కిన తర్వాత కేక్‌ టిన్‌ ఉంచి, గ్యాస్కెట్‌ లేకుండా కుక్కర్‌ మూతతో మూయాలి. మీడియం మంట మీద 40 నిమిషాల పాటు ఉడికించుకుంటే, చట్‌పట్‌ కేక్‌ రెడీ అయిపోతుంది. తర్వాత టూత్‌ పిక్‌తో కేక్‌ను గుచ్చి చూడాలి. టూత్‌పిక్‌కు కేక్‌ అంటుకోకుండా ఉంటే, పూర్తిగా ఉడికిందని అర్థం. అంచులు వదులు చేసి, టిన్‌ను బోర్లా చేసి, పైన తడితే, కేక్‌ వస్తుంది.  ముక్కలుగా కట్‌ చేసి సర్వ్‌ చేసుకుంటే సరిపోతుంది.


Updated Date - 2022-03-19T19:40:16+05:30 IST