ఇకపై చార్జర్లు విడిగా కొనుక్కోవలసిందే!

ABN , First Publish Date - 2020-07-10T22:33:16+05:30 IST

కరోనా దెబ్బకు ప్రపంచమంతా పొదుపు బాట పట్టింది. ఖర్చులకు దూరంగా ఉంటూ.. తగినంత ఆదా చేయడానికి ప్రయత్నిస్తోంది.

ఇకపై చార్జర్లు విడిగా కొనుక్కోవలసిందే!

ఇంటర్నెట్ డెస్క్: కరోనా దెబ్బకు ప్రపంచమంతా పొదుపు బాట పట్టింది. ఖర్చులకు దూరంగా ఉంటూ.. తగినంత ఆదా చేయడానికి ప్రయత్నిస్తోంది. తాజాగా మొబైల్ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మొబైల్‌తో పాటు ఇచ్చే చార్జర్‌లకు కత్తెర వేయనున్నట్టు సమాచారం. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా మొబైల్ తయారీ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. సామ్‌సంగ్ కంపెనీ వచ్చే ఏడాది నుంచి చార్జర్ లేకుండా మొబైల్ అమ్మకాలను చేపట్టనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే యాపిల్ 12లో చార్జర్, ఇయర్ ఫోన్స్ లేకుండానే విడుదల చేయడానికి ఆ సంస్థ రెడీ అవుతున్నట్టు చెబుతున్నారు. అయితే సామ్‌సంగ్, యాపిల్‌ తయారీదారుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. త్వరలోనే ఓ స్పష్టమైన ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది.      


Updated Date - 2020-07-10T22:33:16+05:30 IST