Advertisement
Advertisement
Abn logo
Advertisement

బాధ్యతలకు వెనకాడితే సీఎంగా ఉండే అర్హత జగన్‌కు లేదు.. సొంత జిల్లాకెళ్లి ఏం చేశారు..? : Chandrababu

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మరోసారి టీడీపీ అధినేత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శనివారం నాడు కడప జిల్లా అన్నమయ్య ప్రాజెక్టు వైఫల్యంపై మీడియా మీట్ నిర్వహించిన ఆయన.. వైసీపీ ప్రభుత్వానికి జవాబుదారీతనం లేదని మండిపడ్డారు. జగన్‌ బాధ్యతలకు అతీతుడు కాదని.. బాధ్యతలకు వెనకాడితే సీఎంగా ఉండే అర్హత జగన్‌కు లేదన్నారు. తెలిసో తెలియకో ఓట్లేసిన పాపానికి ప్రజల ప్రాణాలు తీస్తారా? అని బాబు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. వర్షాలు భారీగా పడి రెండుసార్లు వరదలొచ్చాయి. ప్రాజెక్టులన్నీ అప్పటికే పూర్తిగా నిండిపోయాయి. మళ్లీ వరద వస్తుందని వాతావరణశాఖ ముందే హెచ్చరించింది. అయినా స్పందించకపోవడం వల్లే విపత్తు జరిగింది. విపత్తుకు బాధ్యులైన వారందరినీ శిక్షించాలి అని చంద్రబాబు అన్నారు.

ఏం సమాధానం చెబుతారు..!?

మీకు  బాధ్యత లేదా?, మిమ్ముల్ని చట్టబద్ధంగా శిక్షించకూడదా?. జగన్‌ ప్రభుత్వం వైఫల్యం వల్లే ప్రాణ నష్టం జరిగింది. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు మొత్తం కొట్టుకుపోయాయి. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లకు కూడా మరమ్మతులు చేయించలేదు. ప్రభుత్వ తప్పిదం వల్లే వరదల్లో 62 మంది చనిపోయారు. వరదల్లో రూ.6 వేల కోట్ల పంట, ఆస్తి నష్టం జరిగింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రాణనష్టమని కేంద్రమంత్రి చేసిన ప్రకటనకు ఏం సమాధానం చెబుతారు?. జ్యుడీషియల్ ఎంక్వయిరీ అడిగితే ఎందుకు అంగీకరించలేదు? అని జగన్ ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించారు.


సొంత జిల్లాకెళ్లి ఏం చేశారు..!?

ఒక వ్యక్తి 9 మందిని ఎక్కించుకుని చాలావరకు కాపాడాడు. ఏడుగురిని కాపాడగలిగాడు.. శ్వాస ఆడక ఇద్దరు చనిపోయారు. వరదలతో పరిస్థితి సీరియస్‌గా ఉంటే చర్చించకుండా మాపై దాడి చేస్తారా..?. సీఎం జగన్ సొంత జిల్లాకు వెళ్లి ఏం చేశారు?. ఎవరూ మాట్లాడకుండా ముందే బాధితులను బెదిరించారు. అసలు ప్రజల్ని చంపేందుకు మీకు లైసెన్స్‌ ఇచ్చారు?. తిరుపతి తుమ్మలగుంట చెరువును క్రికెట్‌ స్టేడియం చేశారు. దీంతో పద్మావతి వర్సిటీ నుంచి ఆటోనగర్‌ వరకు వరద వచ్చింది. రాయలచెరువు తెగి ఉంటే 35 గ్రామాల జలమయం అయ్యేవి. మామూలు వ్యక్తులతో రాయలచెరువుకు మరమ్మతులు చేయిస్తారా..? అని చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

సీఎంకు సిగ్గు లేకుండా..!

వరదల్లో రాష్ట్రం ఉంటే అసెంబ్లీలో నా మొహం చూడాలి అని సీఎం ఇక్కడ ఉన్నాడు. ఎవరిని బయటకు రాకుండా.. బాదితులకంటే ఎక్కువ పోలీసులను పెట్టి ఓదార్పు చేస్తారా!?. గతంలో వరదలు వచ్చినప్పుడు అన్నమయ్య ప్రాజెక్ట్ గేటు క్లోజ్ అవ్వలేదు.. నీరు వృధాగా పోయింది. ఈ సారి వరదలకు అదే గేట్ ఓపెన్ అవ్వలేదు.. గేట్ సమస్య అప్పటికప్పుడు వచ్చింది కాదు. ఇసుక కోసం నదిలోకి వెళ్లిన టిప్పర్‌ల కోసమే నీటిని విడుదల చేయలేదు. ప్రజల ప్రాణాలు పోవడానికి కారణం అయిన జగన్ ముఖ్యమంత్రి పదవిలో ఉండడానికి అనర్హులు. తుమ్మల కుంట చెరువును క్రికెట్ స్టేడియంలా మార్చారు...దీనికి ఎవరు బాద్యులు!?. పెన్నా నదిలో కరకట్టలకు ప్రమాదం జరిగేలా ఇసుక తవ్వకాలు జరిపారు. ఒక్క నెల్లూరులోనే రూ. 2 వేల కోట్ల నష్టం జరిగింది. ప్రాణాలకు రక్షణ కాదు.. డెడ్ బాడీ కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఇది. రాష్ట్రంలో ఈ స్థాయి వరదలు ఉంటే సీఎం సిగ్గులేకుండా నాడు పెళ్లికి పోయాడు. వేరే ప్రభుత్వం అయితే ఇలాంటి ఘటనకు సిగ్గుతో తల వంచుకుంటారు. విశాఖ విషాదంలో బాధితులకు కోటి పరిహారం ఇచ్చారు.. ఇక్కడ బాధితులకు కోటి ఇవ్వాలి. జ్యుడీషియల్ విచారణ జరిపించాలిఅని చంద్రబాబు డిమాండ్ చేశారు.


గ్రీజ్ లేదు కానీ.. మూడు రాజధానులా..!?

‘ప్రాజెక్ట్ గేటుకు గ్రీజ్ వెయ్యలేని సీఎం.. మూడు రాజధానులు కడతారా!?. ఒక మూసలావిడ నవ్వుతూ సీఎంను పొగిడింది అని చెపుతున్నారు.. ఇది జగన్ తరహా రాజకీయం. వరదలకు ప్రాణాలు.. ఆస్తులు పోతే జనం జగన్‌ను చూసి మురిసిపోతారా.. స్వాగతం పలుకుతారు!. OTS స్కీమ్ మంచి ప్రోగ్రాం అని సీఎం ఎలా చెపుతారు!?. కరోనా టైంలో చనిపోయే పరిస్థితి ఉంటే OTS కు ప్రజలు 20 వేలు కట్టాలా!?. టీడీపీ ప్రభుత్వం రాగానే నెల రోజుల్లో పట్టా ఇస్తాంఅని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

Advertisement
Advertisement