Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇది ఉగ్రవాదం కాకపోతే మరేమిటి?: చంద్రబాబు

అమరావతి: సీఎం జగన్‌ దుష్పరిపాలన ప్రజలందరికీ తెలియాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ బూతులు మాట్లాడాలేని తెలిపారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, ఇది ఉగ్రవాదం కాకపోతే మరేమిటి? అని చంద్రబాబు ప్రశ్నించారు. కాసేపట్లో చంద్రబాబు 36 గంటల పాటు చేసిన దీక్ష విరమించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇదివరకు మూడు సార్లు దీక్ష చేశానని తెలిపారు. 70 లక్షల మంది కార్యకర్తల మనోభావాలు ఇక్కడున్నాయని, దేవాలయం లాంటి పార్టీ ఆఫీస్‌పై దాడి ఉగ్రదాడేనని చంద్రబాబు స్పష్టం చేశారు. 100 గజాల దూరంలో డీజీపీ ఆఫీస్‌ ఉందని, డీజీపీ సరైన చర్యలు తీసుకుంటే ఇది జరిగేదా..? అని ప్రశ్నించారు. ఏపీని డ్రగ్స్‌కు కేంద్రంగా మార్చారని ధ్వజమెత్తారు.  ఇష్టానుసారంగా పాలసీలు డిసైడ్‌ చేయడానికి వీల్లేదన్నారు. కల్తీ మద్యంతో ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారని దుయ్యబట్టారు. డ్రగ్స్‌తో ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. డ్రగ్స్‌పై టీడీపీ పోరాటం చేస్తుందన్నారు. ఏపీలో లక్ష కోట్ల డ్రగ్స్‌ ఉన్నట్టు మీడియా కథనాలు వచ్చాయని చంద్రబాబు తెలిపారు. 


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement