చంద్రబాబు హైదరాబాద్‌లో హోం క్వారంటైన్‌లో ఉన్నారు: కన్నబాబు

ABN , First Publish Date - 2020-04-09T01:07:30+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్‌లో హోం క్వారంటైన్‌లో ఉన్నారని మంత్రి కన్నబాబు ఎద్దేవాచేశారు. రోజూ ఎవరో ఒకరికి లేఖలు రాస్తున్నారని, చాలా సంతోషమన్నారు.

చంద్రబాబు హైదరాబాద్‌లో హోం క్వారంటైన్‌లో ఉన్నారు: కన్నబాబు

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్‌లో హోం క్వారంటైన్‌లో ఉన్నారని మంత్రి కన్నబాబు ఎద్దేవాచేశారు. రోజూ ఎవరో ఒకరికి లేఖలు రాస్తున్నారని, చాలా సంతోషమన్నారు. కరోనా పోయేవరకు చంద్రబాబు రాజకీయం చేయడం మానితే మంచిదని సూచించారు. రూ.1000 ఇచ్చి ఓటు అడిగినట్టు నిరూపించగలరా? అని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లకు రూ.వేలకోట్లు ఇచ్చారని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, కరోనాపై యుద్ధం చేస్తుంటే... టీడీపీకి రాజకీయమే కావాలని కన్నబాబు దుయ్యబట్టారు.

Updated Date - 2020-04-09T01:07:30+05:30 IST