తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికపై చంద్రబాబు ఫోకస్

ABN , First Publish Date - 2021-03-18T00:27:09+05:30 IST

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఏప్రిల్ 17న తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో చంద్రబాబు దృష్టి సారించారు.

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికపై చంద్రబాబు ఫోకస్

అమరావతి: తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఏప్రిల్ 17న తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో చంద్రబాబు దృష్టి సారించారు. టీడీపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీ పోటీ చేయనున్నారు. తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికపై గురువారం ఉదయం ముఖ్యనేతలతో ఆయన భేటీ కానున్నారు. రేపు సాయంత్రం తిరుపతి పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు సమావేశమవుతారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.


తిరుపతి పార్లమెంటు స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలపై టీడీపీ ఐదంచెల వ్యూహం రూపొందించిన విషయం తెలిసిందే. కేడర్‌ నుంచి లీడర్‌ వరకూ క్షేత్రస్థాయిలోనే ఉండేలా ఈ వ్యూహం సిద్ధమయింది. పోలింగ్‌ కేంద్రాలు, పంచాయతీలు.. మండలాలు..అసెంబ్లీ.. పార్లమెంట్.. ఇలా ఐదు అంచెల్లో తిరుపతి లోక్‌సభ పరిధిలోని ప్రతి ఓటరునూ చేరేందుకు 9143 మంది సుశిక్షితులైన పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్‌ జారీకి ముందే తన అభ్యర్థిగా మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మిని టీడీపీ ప్రకటించింది. తద్వారా తిరుపతి ఎన్నికల క్షేత్రంలో దూకుడు ప్రదర్శించింది. 

Updated Date - 2021-03-18T00:27:09+05:30 IST