హక్కుల కోసం రోడ్డెక్కడం తప్పా.? : చంద్రబాబు

ABN , First Publish Date - 2022-04-26T02:38:10+05:30 IST

ఉద్యోగులు, ఉపాధ్యాయులపై జగన్‌రెడ్డి ప్రతీకారం దుర్మార్గమని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అన్నారు.

హక్కుల కోసం రోడ్డెక్కడం తప్పా.? : చంద్రబాబు

అమరావతి: ఉద్యోగులు, ఉపాధ్యాయులపై జగన్‌రెడ్డి ప్రతీకారం దుర్మార్గమని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. సోమవారం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘న్యాయం కోసం రోడ్డెక్కితే అణిచివేత లక్ష్యంగా పెట్టుకున్నారు. గతంలో పీఆర్సీ విషయంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఉద్యమానికి నేడు సీపీఎస్ ఉద్యమంపై ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటోంది. హక్కుల కోసం ఐక్య పోరాటం చేయడానికి కూడా వీల్లేదనేలా అరెస్టులు చేస్తున్నారు.హక్కుల కోసం రోడ్డెక్కడం తప్పా.?దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యాసంవత్సరాన్ని జూన్ 12 నుంచి జులై 8కి మార్చడం ఏంటి?స్కూళ్లను మూసివేయడం వంటి విధానాలతో విద్యావ్యవస్థను నాశనం చేస్తున్నారు.నెల్లూరులో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కేసుకు సంబంధించిన సాక్ష్యాలు దొంగిలించడబడడం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది’’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.


విచారణ పేరుతో వేధించడం దారుణం

‘‘నేరస్తులకు కొత్త కొత్తగా నేరాలు చేయడానికి వైసీపీ ప్రభుత్వం మార్గాలు చూపిస్తోంది. రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురిసినప్పటికీ తాగునీటి కష్టాలు ఎదురవడానికి ప్రభుత్వ అసమర్ధ విధానాలే కారణమన్నారు.కుటంబంతో కలిసి తిరుమల వెళ్తున్న భక్తుల కారును బలవంతంగా లాక్కొవడమే కాకుండా...ఇప్పుడు ఆ కుటుంబాన్ని విచారణ పేరుతో వేధించడం దారుణం.ఈ విషయంలో బాధిత కుటుంబానికి క్షమాపణ చెప్పాల్సింది పోయి.... నోటీసులతో వేధిస్తారా?జగన్ అసమర్థ పాలనతో యువత భవిష్యత్ కాలరాశాడు.చేతగాని తనంతోనే పోలవరాన్ని బలి చేశారు.జగన్ పాలనపై యువత తీవ్ర ఆవేదన, అసంతృప్తితో ఉన్నారుమిగులు విద్యుత్ రాష్ట్రంలో విద్యుత్ కోతలు జగన్ చేతకానితనమే అని చంద్రబాబు సీఎం జగన్ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


సభ్యత్వ నమోదు కార్యక్రమం యుద్ధ ప్రాతిపాదికగా పూర్తి చేయాలి

‘‘తెలుగుదేశం సభ్యత్వ నమోదు కార్యక్రమం యుద్ధ ప్రాతిపాదికగా పూర్తి చేయాలి. టీడీపీతో ఉండే ప్రతి కుటుంబ సభ్యుడూ సభ్యత్వాన్ని తీసుకునేలా ప్రోత్సహించాలి.అనుబంధ కమిటీల్లో యువతకు అధిక ప్రాధాన్యం కల్పించడం... గ్రామస్థాయిలో అన్ని కమిటీల్లో యువత అధికంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి’’ అని చంద్రబాబు తెలిపారు.

Updated Date - 2022-04-26T02:38:10+05:30 IST