ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కన్నా పరిస్థితి దుర్మార్గంగా ఉంది: చలసాని

ABN , First Publish Date - 2021-08-05T23:50:19+05:30 IST

ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కన్నా పరిస్థితి దుర్మార్గంగా ఉంది: చలసాని

ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కన్నా పరిస్థితి దుర్మార్గంగా ఉంది: చలసాని

న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేకహోదా, ఉక్కు కర్మాగారం, పోలవరం‌పై మూడు రోజులుగా పోరాటం చేస్తున్నామని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ తెలిపారు. విభజన హామీల అమలు కోసం ఏనాడూ పోరాటం ఆపలేదని, కోవిడ్ వల్ల కొంత నెమ్మదించిందని ఆయన చెప్పారు. పోలవరం నిర్వాసితుల సమస్యను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు వివరించామన్నారు. అయితే నిర్మలా సీతారామన్ మాట్లాడిన మాటలు ఆంధ్రులు హృదయాలను గాయపరిచేటట్లు ఉన్నాయని చలసాని ఆవేదన వ్యక్తం చేశారు.  2013- 14 బడ్జెట్‌లో ఉన్న రూ. 20 వేల కోట్లనే ఏపీకి ఇస్తామన్నారని, తర్వాత ఇవ్వాల్సిన అవసరం ఏంటని నిర్మల ప్రశ్నించినట్లు శ్రీనివాస్ తెలిపారు.


రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్యాకేజీ ప్రకారం నిధులు ఎందుకు ఇవ్వలేదని ఆమెను ప్రశ్నించినట్లు చలసాని తెలిపారు. కడప ఉక్కు, రామాయపట్నం పోర్టు, విశాఖ-చెన్నై కారిడార్ నిధులపై ప్రశ్నిస్తే ఆమె మౌనంగానే ఉన్నారన్నారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కన్నా దుర్మార్గంగా పరిస్థితి ఉందని చలసాని ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు. నీటి విషయంలో రెండు రాష్టాల ముఖ్యమంత్రులు కేంద్రం పాదాల వద్ద దండం పెట్టే పరిస్థితులు వచ్చాయని చెప్పారు. ఏపీ, తెలంగాణకు హక్కులు లేవా? అని చలసాని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. 



Updated Date - 2021-08-05T23:50:19+05:30 IST