క్యాన్సర్‌ రోగుల కోసం ఈ గాయని ఏం చేస్తోందంటే..!?

ABN , First Publish Date - 2021-12-31T05:48:04+05:30 IST

క్యాన్సర్‌ రోగు ల కోసం ఓ గాయని తన కురులను స్వచ్ఛందంగా అందించి ఆదర్శంగా నిలిచింది.

క్యాన్సర్‌ రోగుల కోసం ఈ గాయని ఏం చేస్తోందంటే..!?
కత్తిరించుకున్న జుట్టుతో చైతన్య క్రాంతి

వరంగల్‌ కలెక్టరేట్‌, డిసెంబరు 30: క్యాన్సర్‌ రోగు ల కోసం ఓ గాయని తన కురులను స్వచ్ఛందంగా అందించి ఆదర్శంగా నిలిచింది.  కరీమాబాద్‌కు చెందిన  పిట్టల చైతన్యక్రాంతి తెలంగాణ జాగృతి కళాకారిణి. హైదరాబాద్‌కు చెందిన శివ యాదవ్‌.. విగ్గులను తయారు చేసి, క్యాన్సర్‌తో జుట్టును కోల్పోయినవారికి అందిస్తుంటారు. ఈ నేపథ్యంలో వారి కోసం కురులను ఇచ్చేందుకు ముందుకు రావాలంటూ తన ఫేస్‌బుక్‌లో హెయిర్‌ డొనేషన్‌ ఫర్‌ క్యాన్సర్‌ పేషెంట్‌ అంటూ విజ్ఞప్తి చేశాడు. దీనికి స్పందించిన చైతన్యక్రాంతి బుధవారం ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 14 ఇంచుల పొడవు ఉన్న తన కురులను అందజేశారు. తనలాగే కురులను ఇచ్చేందుకు అందురూ ముందుకురావాలని  ఆమె విజ్ఞప్తి చేసింది. 




Updated Date - 2021-12-31T05:48:04+05:30 IST