యూఏఈ చార్ట‌ర్డ్ విమాన స‌ర్వీసుల‌కు నో చెప్పిన‌ కేంద్రం

ABN , First Publish Date - 2020-07-05T16:25:30+05:30 IST

గ‌త కొన్ని రోజులుగా యూఏఈ నుంచి భార‌త్‌కు చార్ట‌ర్డ్ విమాన స‌ర్వీసులు ప‌ని చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే, తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం యూఏఈ చార్టర్డ్ విమాన స‌ర్వీసుల‌కు అనుమ‌తి నిరాక‌రించింది.

యూఏఈ చార్ట‌ర్డ్ విమాన స‌ర్వీసుల‌కు నో చెప్పిన‌ కేంద్రం

దుబాయి: గ‌త కొన్ని రోజులుగా యూఏఈ నుంచి భార‌త్‌కు చార్ట‌ర్డ్ విమాన స‌ర్వీసులు ప‌ని చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే, తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం యూఏఈ చార్టర్డ్ విమాన స‌ర్వీసుల‌కు అనుమ‌తి నిరాక‌రించింది. అక్క‌డి ఎయిర్‌లైన్స్‌ల‌కు సంబంధించిన ద‌ర‌ఖాస్తుల‌ను కూడా పౌర విమాన‌యాన శాఖ స్వీక‌రించ‌డం లేద‌ని స‌మాచారం. అదే స‌మ‌యంలో వివిధ‌ భార‌త ప్ర‌వాస సంఘాలు యూఏఈ నుంచి చార్ట‌ర్డ్ విమానాలు న‌డిపించాల్సిందిగా కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరుతున్నాయి. ఎమిరేట్స్‌, ఎతి‌హాద్‌, ఎయిర్ అరేబియా త‌దిత‌ర‌ ఎయిర్‌లైన్స్‌ల‌కు చెందిన చార్ట‌ర్డ్ ఫ్లైట్స్‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని కోరాయి. కానీ ఇప్పటివరకు ఈ దరఖాస్తులను కేంద్రం పరిగణలోకి తీసుకోలేద‌ని తెలుస్తోంది.


అయితే, చార్టర్డ్ సేవలను నిర్వహించడానికి భారత విమానయాన సంస్థలను మాత్రమే అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విష‌య‌మై భారత, యూఈఏ దౌత్యవేత్తలు చర్చలు జరుపుతున్నారు. కానీ ఇరు దేశాలు ఇంకా ఏకాభిప్రాయానికి రాలేదు. దీంతో యూఏఈ నుంచి భార‌త్‌కు చార్ట‌ర్డ్ విమాన స‌ర్వీసుల నిర్వ‌హ‌ణ‌పై అనిశ్చితి నెల‌కొంది. కాగా, ఇతర గల్ఫ్ దేశాల నుండి భారతదేశానికి చార్టర్డ్ విమానాల నిర్వహణపై ఎలాంటి అనిశ్చితి లేదు. ఇదిలా ఉంటే... ఆగస్టు 1 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభిస్తామని కువైట్ ప్రకటించిన విష‌యం తెలిసిందే. తిరువనంతపురం, కొచ్చి సహా 7 భారతీయ నగరాలకు కువైట్ విమాన సర్వీసులు నడప‌నుందని సమాచారం.

Updated Date - 2020-07-05T16:25:30+05:30 IST