టీడీపీ వినతిపత్రం స్వీకరణకు కేంద్ర బృందం నిరాకరణ

ABN , First Publish Date - 2022-08-11T20:45:54+05:30 IST

వరదలపై అంచనా వేసేందుకు వచ్చిన కేంద్రబృందం అధికారుల తీరుపై జిల్లా టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేశారు. వరద బాధితులకు...

టీడీపీ వినతిపత్రం స్వీకరణకు కేంద్ర బృందం నిరాకరణ

జంగారెడ్డిగూడెం (ఏలూరు జిల్లా): వరదల (Floods)పై అంచనా వేసేందుకు వచ్చిన కేంద్రబృందం అధికారుల తీరు (central team officials)పై జిల్లా టీడీపీ నేతలు  (Tdp Leaders) అసహనం వ్యక్తం చేశారు. వరద బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ రాజమండ్రి (Rajahmundry)‎ మంజీరా హోటల్‎లో ఉన్నకేంద్ర బృందానికి వినతి పత్రాన్ని ఇచ్చేందుకు టీడీపీ నేతలు చేసిన ప్రయత్నం వృదా అయింది. కనీసం వారిని దగ్గరికి రానివ్వలేదు.. వినతి పత్రాన్ని కూడా స్వీకరించలేదు. దీంతో టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. వరద బాధితులను కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఆదుకోవాలని మీడియా ద్వారా టీడీపీ నేతలు కోరారు. 


ఈ కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షుడు కేయస్ జవహర్, పోలవరం, రంపచోడవరం నియోజకవర్గాల ఇంచార్జిలు బొరగం శ్రీనివాసులు, వంతల రాజేశ్వరి, కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు జ్యోతుల నవీన్, జి హరీష్ మధుర్, రాష్ట్ర పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆదిరెడ్డి వాసు, మాజీ ఎమ్మెల్యే లు బండారు సత్యానందరావు, ముప్పిడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-08-11T20:45:54+05:30 IST