హైదరాబాద్ (Hyderabad): సీఎం కేసీఆర్ (Cm Kcr) కుటుంబానికి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ (Central Minister Smriti Irani) కౌంటర్ ఇచ్చారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆమె ప్రధాని మోదీ (Pm Modi)పై సీఎం కేసీఆర్ (Cm Kcr) చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబానికి రాజకీయాలంటే సర్కస్ కావచ్చని.. తమకు మాత్రం బాధ్యతన్నారు. రాజ్యాంగ ఉల్లంఘనకు మారు పేరు సీఎం కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. ప్రధానికి స్వాగతం పలికే ప్రోటోకాల్ పాటించని నేత కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ (Telangana)లో రాచరిక పాలన సాగుతుందని మండిపడ్డారు. కుటుంబ పాలనకు ప్రజలు ఆమోదం తెలపరని చెప్పారు. వారసత్వ రాజకీయాలను బీజేపీ (Bjp) ఫాలో అవ్వదన్నారు. అవినీతి, కుటుంబ పాలనకు మారు పేరు టీఆర్ఎస్ అని స్మృతి ఇరానీ విమర్శించారు.
ఇవి కూడా చదవండి