Advertisement
Advertisement
Abn logo
Advertisement

తెలుగు ప్రజలకు అందుబాటులో ఉంటా: కిషన్‌రెడ్డి

ఢిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందుబాటులో ఉంటానని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ విస్తరణలో కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. కేంద్రం నుంచి సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని ఆయన పేర్కొన్నారు. విభజన అంశాల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. తనకు మోదీ ఏ శాఖ కేటాయించినా చిత్తశుద్ధితో పనిచేస్తానన్నారు. దేశంలో అందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్‌ అందిస్తామన్నారు. తొమ్మిదిసార్లు గాంధీ ఆస్పత్రిని సందర్శించానన్నారు. హైదరాబాద్‌కు కేంద్రం ఇచ్చిన కానుక రీజినల్‌ రింగురోడ్డు అని కిషన్‌రెడ్డి తెలిపారు. 

Advertisement
Advertisement