Abn logo
Oct 23 2021 @ 10:38AM

కాంగ్రెస్‌తో కలిసే ఖర్మ మాకేంటి..?: Kishan reddy

హనుమకొండ: హుజురాబాద్ ఎన్నికలు తెలంగాణ రాజకీయాలను దిశా నిర్దేశం చేస్తాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇంత నిర్భంధంలోనూ హుజూరాబాద్ ప్రజలు బీజేపీకి అండగా ఉన్నారని తెలిపారు. హుజూరాబాద్‌లో బీజేపీ గెలుపు ఖాయమని మెజారిటీపైనే చర్చ ఉంటుందన్నారు. కేసీఆర్ కుటుంబం అబద్దాల పూనకం ఊగుతోందని మండిపడ్డారు. సీఎం పదవి ఎడమకాలి చెప్పుతో సమానం అన్న కేసీఆర్‌కు ఓటు అడిగే హక్కు లేదని అన్నారు. కాంగ్రెస్‌తో కలిసే ఖర్మ మాకేంటి అని అన్న కిషన్‌ రెడ్డి అలాంటి చీకటి ఒప్పందాలు కేసీఆర్‌కే సాధ్యమని వ్యాఖ్యానించారు. 

ఇవి కూడా చదవండిImage Caption