అంజనాద్రిని హనుమంతుని జన్మస్థలంగా ప్రకటించలేం

ABN , First Publish Date - 2021-07-20T23:26:24+05:30 IST

హనుమంతుని జన్మస్థలంపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌‌రెడ్డి స్పష్టత ఇచ్చారు. జాపాలి

అంజనాద్రిని హనుమంతుని జన్మస్థలంగా ప్రకటించలేం

న్యూఢిల్లీ: హనుమంతుని జన్మస్థలంపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌‌రెడ్డి స్పష్టత ఇచ్చారు. జాపాలి తీర్ధంలోని అంజనాద్రి పర్వతాన్ని హనుమంతుని జన్మస్థలంగా ప్రకటించే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని కిషన్‌ రెడ్డి వెల్లడించారు. ప్రాచీన సాహిత్యం, శాసనాలు, చారిత్రక, ఖగోళ శాస్త్ర అంచనాలు వంటి ఆధారాలతో హనుమంతుడి జన్మస్థలాన్ని టీటీడీ ప్రకటించింది. తిరుమలకు ఉత్తరంగా జాపాలి తీర్ధంలోని అంజనాద్రి పర్వతమే  హనుమంతుడి జన్మస్థలమని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ధారించింది. అయితే టీటీడీ ప్రకటించిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా అన్న ప్రశ్నకు, హనుమంతుని జన్మస్థలంపై టీటీడీ విడుదల చేసిన పుస్తకం, పత్రికలలో వచ్చిన వార్తల ద్వారా ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లు కిషన్‌ రెడ్డి చెప్పారు.

Updated Date - 2021-07-20T23:26:24+05:30 IST