విదేశీ ప్రయాణికులకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు..!

ABN , First Publish Date - 2020-08-03T14:04:42+05:30 IST

విదేశాల నుంచి భారత్‌కు వచ్చే విమాన ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా నెగెటివ్‌ ఉన్న ప్రయాణి

విదేశీ ప్రయాణికులకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు..!

  • కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల

న్యూఢిల్లీ, ఆగస్టు 2: విదేశాల నుంచి భారత్‌కు వచ్చే విమాన ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా నెగెటివ్‌ ఉన్న ప్రయాణికులకు, తీవ్రమైన జబ్బులు ఉన్న వారికి, గర్భిణులకు, పదేళ్లలోపు ఉన్న పిల్లలున్న తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మరణిస్తే వారిని చూడడానికి వెళ్తున్న ప్రయాణికులకు ఏడు రోజుల ఇన్‌స్టిట్యూషనల్‌ క్వా రంటైన్‌ (ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే క్వారంటైన్‌ కేంద్రాలు) నుంచి మినహాయింపును ఇచ్చింది. ఆ ప్రయాణికులందరూ అత్యవసర క్వారంటైన్‌కు బదులుగా 14 రోజుల హోం క్వారంటైన్‌కు వెళ్లాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే వారందరూ విమానం ఎక్కే 72 గంటల ముందు www.newdelhiairport.in పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. ‘‘కరోనా నెగెటివ్‌ ఉన్నట్లు చెప్పుకొనే ప్రయాణికులు నెగెటివ్‌ ఆర్టీపీసీఆర్‌ టెస్టు నివేదికను చూపాలి. ఈ టెస్టును ప్రయాణానికి 96 గంటల ముందే చేయించుకొని ఉండాలి. ఈ టె స్టు రిపోర్టును ఆ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి. తప్పుడు సమాచారమిస్తే చర్యలు తీసుకుంటాం’’ అని కేంద్రం హెచ్చరించింది. అలాగే ప్రయాణానికి 72 గంటల ముందు ఆ పోర్టల్‌లో సెల్ఫ్‌-డిక్లరేషన్‌ను సమర్పించాలని సూచించింది.

Updated Date - 2020-08-03T14:04:42+05:30 IST