Advertisement
Advertisement
Abn logo
Advertisement

హైదరాబాద్‌ ప్రతిష్ఠ దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వ ర్యాంకింగ్‌: మేయర్

హైదరాబాద్: హైదరాబాద్‌ ప్రతిష్ఠ దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వ ర్యాంకింగ్‌ ఇచ్చిందని మేయర్ విజయలక్ష్మి తప్పుబట్టారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాజకీయ దురుద్దేశంతోనే హైదరాబాద్‌ ర్యాంకింగ్ తగ్గించారని విమర్శించారు. హైదరాబాద్‌కు ఉత్తమ నగరానికి ఉండాల్సిన ప్రామాణికాలు ఉన్నాయన్నారు. 24వ ర్యాంక్‌ను హైదరాబాదీలు అంగీకరించరని విజయలక్ష్మి చెప్పారు.


అత్యుత్తమ జీవన పమ్రాణాలతో హాయిగా జీవించేందుకు అనువైన నివాసయోగ్య నగరాల జాబితాలో, మునిసిపల్‌ పనితీరు సూచీలో.. హైదరాబాద్‌ సహా తెలంగాణ నగరాలన్నీ వెనుకబడ్డాయి. కేంద్రం తాజాగా విడుదల చేసిన ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ సూచీ-2020లో కేవలం 55.4 స్కోర్‌తో హైదరాబాద్‌ 24 స్థానంలో నిలిచింది. మునిసిపల్‌ పనితీరులో 49.08 స్కోరుతో 17వ ర్యాంకు పొందింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి, ఆ శాఖ కార్యదర్శి దుర్గా శంకర్‌ మిశ్రా గురువారం ఈ సూచీలను విడుదల చేశారు.

Advertisement
Advertisement