Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏపీకి కేంద్రం మరోసారి మొండిచేయి

ఢిల్లీ: ఏపీకి కేంద్రం మరోసారి మొండిచేయి చూపింది. ఏపీలో రైల్వేజోన్ హామీకి కేంద్రం తిలోదకాలు ఇచ్చింది. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌పై కేంద్రం వైఖరిని స్పష్టం చేసింది. దేశంలో ఇక కొత్త రైల్వే జోన్‌లను ఏర్పాటు చేసే ఉద్దేశం లేదని కేంద్రం తేల్చిచెప్పింది. బీజేపీ ఎంపీ అజయ్‌నిషాద్ ప్రశ్నకు కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ జవాబిచ్చారు. దేశంలో ప్రస్తుతం 17 రైల్వేజోన్లు ఉన్నాయని కేంద్రమంత్రి వెల్లడించారు. విశాఖ రైల్వేజోన్ అంశాన్ని అశ్వనీ వైష్ణవ్ ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్ మేరకు.. మరిన్ని జోన్‌లను ప్రకటించే ఉద్దేశం లేదని ఆయన స్పష్టం చేశారు.


రైల్వేజోన్ సాధ్యాసాధ్యాలపై గతంలో ఓఎస్‌డీని కేంద్రం నియమించింది. రైల్వేజోన్‌పై కేంద్రానికి ఓఎస్‌డీ నివేదిక ఇచ్చింది. అయితే దీనిపై ఎటూ కేంద్రం తేల్చలేదు. ఇక ఏపీలో రైల్వేజోన్ అసాధ్యమంటున్న రైల్వేశాఖ అధికారులు చెబుతున్నారు. రైల్వేజోన్‌పై కేంద్రం దగ్గర ఇప్పటివరకూ జగన్ ప్రభుత్వం ప్రస్తావించలేదు. జగన్ ప్రభుత్వం స్పందించని కారణంగానే ఏపీ రైల్వేజోన్‌ను కేంద్రం పక్కన పెట్టిందని రైల్వేశాఖ అధికారులు విమర్శిస్తున్నారు.

Advertisement
Advertisement