Abn logo
Nov 25 2021 @ 16:32PM

ఈనెల 26న ‘జాతీయ పాల దినోత్సవం’

హైదరాబాద్: ఆజాదీ అమ్రత్ మహోత్సవ్ ఉత్సవాల్లో భాగంగా డాక్టర్ వర్గీస్ యురియన్ (మిల్క్ మేన్ఆఫ్ ఇండియా) జయంతి సందర్భంగా ఈ నెల 26న ‘ నేషనల్ మిల్క్ డే’ (జాతీయ పాలదినోత్సవం)గా నిర్వహించనున్నట్టు కేంద్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ వెల్లడించింది.గుజరాత్ లోని నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డు(ఎన్ డిడి బి) ప్రాంగణంలోని టికె పటేల్ ఆడిటోరియంలో  ఈ ఉత్సవాలను వారం రోజుల పాటు దేశ వ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలను జాతీయ పాడిపరిశ్రమ శాఖ, నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డుసంయుక్తంగా నిర్వహించనున్నాయి. 


ఉత్తమ పాడి రైతులకు, ఉత్తమ బ్రీడ్స్, బెస్ట్ ఆర్టిఫిషియల్ ఇన్ సెమినేషన్ టెక్నీషియన్, బెస్ట్ కోఆపరేటివ్ సొసైటీ, పాల ఉత్పత్తి దారులకు ఈ అవార్డులు అందజేయనున్నారు. ఈ సందర్భంగా జాతీయ గోపాల్ రత్నఅవార్డులను విజేతలకు అందజేయనున్నట్టు కేంద్ర ఫిషరీస్, పశుసంవర్ధక, డెయిరీ శాఖ మంత్రి పురుషోత్తం రూపాల తెలిపారు. అలాగే ఉత్సవాల్లో భాగంగా గుజరాత్,కర్నాటక రాష్ట్రాల్లో పలు చోట్ల క్రుత్రిమ గర్భధారణ (ఐవిఎఫ్) కేంద్రాలను ప్రారంభించనున్నారు.