కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొందూదొందే: తులసిరెడ్డి

ABN , First Publish Date - 2022-08-06T09:02:21+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొందూదొందే: తులసిరెడ్డి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొందూదొందే: తులసిరెడ్డి

వేంపల్లె, ఆగస్టు 5: నిత్యావసర వస్తువుల ధరల పెంపు, నిరుద్యోగ సమస్యను పెంచడంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని జగన్‌ ప్రభుత్వం పోటీ పడుతున్నాయని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ నర్రెడ్డి తులసిరెడ్డి నిప్పులు చెరిగారు. ఏఐసీసీ పిలుపుమేరకు వేంపల్లెలో శుక్రవారం కాంగ్రెస్‌ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ పాలనలో పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌, నిత్యావసర సరుకుల ధరలు అసాధారణ రీతిలో పెరిగాయన్నారు.  చిన్నపిల్లలు తాగే పాలమీద, బడిపిల్లలు వాడే పెన్సిళ్లు, రబ్బర్ల మీద కూడా జీఎస్టీ విధించారని ఆయన విమర్శించారు.   జగన్‌ మూడేళ్ల పాలనలో ఇసుక, మద్యం, సిమెంట్‌, నూనెలు, పప్పు దినుసుల ధరలు, కరెంటు చార్జీలు, ఆర్టీసీ చార్టీలు అసాధారణ రీతిలో పెరిగాయని విమర్శించారు. 

Updated Date - 2022-08-06T09:02:21+05:30 IST