Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏపీ సర్కార్‌కు కేంద్రం హెచ్చరిక

అమరావతి: ఏపీ సర్కార్‌కు కేంద్రం హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లను మార్చడం కుదరదని కేంద్రం తేల్చిచెప్పింది. కేంద్ర పథకాలను జగనన్న గోరుముద్ద, జగనన్న పాలు, వైఎస్సార్ సంపూర్ణ పోషణ పేర్లు పెట్టడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర పథకాల పేర్లు మార్చడంపై కేంద్ర మహిళా శిశుసంక్షేమశాఖ నివేదిక కోరింది. 2021 - 22 ఆర్థిక సంవత్సరంలో ఐసీడీఎస్, ఐసీపీఎస్ పథకాలకు కేంద్రం కేటాయించిన రూ.187 కోట్లకు లెక్క చూపాలని కేంద్రం ఆదేశించింది. పథకాల పేర్లపై ఇటీవల కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. రఘురామ ఫిర్యాదుపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.

Advertisement
Advertisement