ముంచుకొస్తున్న విపత్తు!

ABN , First Publish Date - 2021-03-04T06:03:09+05:30 IST

పర్యావరణ విపత్తులు.. ప్రపంచ ప్రధాన సమస్యల్లో ఒకటి. గాలి, నీరు, భూమి అన్నీ కలుషితమవడంతో వాతావరణంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. వరదలు, తుపాన్లు, కరువుకాటకాలు వంటి విపత్తులు ప్రజలు, జీవవైవిధ్యంతోపాటు

ముంచుకొస్తున్న విపత్తు!

వాతావరణ సంక్షోభాలపై సీడీపీ నివేదిక 


పర్యావరణ విపత్తులు.. ప్రపంచ ప్రధాన సమస్యల్లో ఒకటి. గాలి, నీరు, భూమి అన్నీ కలుషితమవడంతో వాతావరణంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. వరదలు, తుపాన్లు, కరువుకాటకాలు వంటి విపత్తులు ప్రజలు, జీవవైవిధ్యంతోపాటు వ్యాపార, బ్యాంకింగ్‌ వ్యవస్థలపైనా పెను ప్రభావం చూపుతున్నాయని కార్బన్‌ డిస్‌క్లోజర్‌  ప్రాజెక్ట్స్‌ (సీడీపీ) వార్షిక నివేదిక హెచ్చరించింది. 


బ్యాంకులకు రూ.6.19 లక్షల కోట్ల ముప్పు

వాతావరణ సంక్షోభాల ప్రభావంతో భారత ప్రధాన బ్యాంకుల్లో 8,400 కోట్ల డాలర్ల (రూ.6.19 లక్షల కోట్లు) మేర రుణాలు మొండి పద్దుల్లోకి మళ్లే ప్రమాదం ఉందని సీడీపీ నివేదిక వెల్లడించింది. పర్యావరణ ముప్పులపై సీడీపీకి రిపోర్ట్‌ చేసిన దేశీయ బ్యాంక్‌ల్లో ఎస్‌బీఐ, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌, ఇండ్‌సఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ తదితర ఆర్థిక సేవల సంస్థలున్నాయి. పర్యావరణ మార్పులకు అధికంగా ప్రభావితమయ్యే సిమెంట్‌, బొగ్గు, ఇంధనం, విద్యుత్‌ తదితర రంగాలకు మంజూరు చేసిన రుణాలపై బ్యాంక్‌లు ప్రధానంగా ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆ నివేదిక పేర్కొంది. వ్యవసాయం, అనుబంధ రంగాలకిచ్చిన రుణాల తిరిగి చెల్లింపులపై వరదలు, తుపాన్ల ప్రభావ అవకాశాలనూ ప్రస్తావించాయి.


కంపెనీలకు రూ.7.14 లక్షల కోట్ల గండి 

వాతావరణ సంక్షోభాల కారణంగా వచ్చే ఐదేళ్లలో రూ.7.14 లక్షల కోట్ల (10వేల కోట్ల డాలర్లు) మేర మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చని భారత ప్రధాన కంపెనీలు అంచనా వేస్తున్నట్లు సీడీపీ నివేదిక పేర్కొంది. 220 భారత కంపెనీల్లో ఇన్వెస్టర్ల కోరిక మేరకు వాతావరణ ప్రభావానికి సంబంధించిన డేటాను వెల్లడించిన 42 కంపెనీల స్పందనల ఆధారంగా ఈ అంచనాకు వచ్చినట్లు బిల్డింగ్‌ సీడీపీ వెల్లడించింది. ఈ 220లో 60 కంపెనీలు బీఎ్‌సఈ టాప్‌-200 లిస్టెడ్‌ జాబితాలోనివని తెలిపింది. భారత కంపెనీలు కర్బన ఉద్గారాలను తగ్గించుకునేందుకు పెద్దఎత్తున కృషి చేయాల్సిన అవసరం ఉందని, వాతావరణ ప్రభావాలపై సమచారాన్ని వెల్లడించాల్సిన ఆవశ్యకత పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనమని నివేదిక పేర్కొంది. 

Updated Date - 2021-03-04T06:03:09+05:30 IST