వైసీపీలో కేసినో ప్రకంపనలు

ABN , First Publish Date - 2022-01-28T02:16:26+05:30 IST

ఫ్యాన్‌ పార్టీలో కేసినో వ్యవహారంపై ప్రకంపనలు పుట్టిస్తోంది. కేసినో వ్యవహారంపై టీడీపీ తగ్గేదేలే అంటోంది.

వైసీపీలో కేసినో ప్రకంపనలు

అమరావతి: ఫ్యాన్‌ పార్టీలో కేసినో వ్యవహారంపై ప్రకంపనలు పుట్టిస్తోంది. కేసినో వ్యవహారంపై టీడీపీ తగ్గేదేలే అంటోంది. కేసినో నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ పార్టీ ప్రతినిధి బృందం గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. కేసినోకు సంబంధించిన పూర్తి ఆధారాలను రాజ్‌భవన్‌లో టీడీపీ అందజేసింది. మంత్రి కొడాలి నానిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసింది. మంత్రి కొడాలి నానిని టార్గెట్‌ చేస్తూ విపక్షాలు మాటల తూటాలు పేల్చుతున్నాయ్. కేసినో నిర్వహణకు సంబంధించి అనేక ఆధారాలను బహిర్గతం చేసినా.. పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. 10 రోజులుగా కేసినో వ్యవహారంపై ఆందోళనలు చేయడంతో పాటు డీజీపీ గౌతమ్ సవాంగ్‌, జిల్లా కలెక్టర్‌, ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. అయినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 



ఇక లాభం లేదనుకున్న టీడీపీ నేతలు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అస్వస్థత కారణంగా గవర్నర్‌ హరిచందన్‌ను నేరుగా కలవలేకపోయిన టీడీపీ నేతలు.. ఆయన కార్యదర్శి సిసోడియాను కలిసి కేసినో నిర్వహణకు సంబంధించిన ఆధారాలను అందజేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన టీడీపీ నేతలు, కొడాలి నానిపై తీవ్ర విమర్శలు చేశారు. కొడాలి నాని, కేసినో నానిగా మారి... రాష్ట్రంలో విషసంస్కృతికి తెరలేపారని దుయ్యబట్టారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ కేసినో వ్యవహారం తెలిసినా కూడా తెలియనట్లు నటిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. 

Updated Date - 2022-01-28T02:16:26+05:30 IST