Advertisement
Advertisement
Abn logo
Advertisement

క్యారెట్‌ టొమాటో సూప్‌

కావలసిన పదార్థాలు: క్యారెట్‌- రెండు, టొమాటోలు- రెండు, ఉల్లిగడ్డ- ఒకటి, వెల్లుల్లి రెబ్బలు- నాలుగు, మిరియాలు, జీలకర్ర పొడి- సగం స్పూను, ఉప్పు- తగినంత, ఆలివ్‌ నూనె- స్పూను.


తయారుచేసే విధానం: కూరగాయల చెక్కుతీసి, ముక్కలుగా కోయాలి. ప్రెజర్‌ కుక్కర్‌లో కూరగాయల ముక్కలు, వెల్లుల్లి, నీళ్లు వేసి మూడు విజిల్స్‌ వరకు ఉడికించి గ్రైండర్‌లో ప్యూరీగా చేసిపెట్టుకోవాలి. ఓ పాన్‌లో ఆలివ్‌ నూనెవేసి మిరియాలు, జీలకర్ర పొడి, ఉప్పు వేసి వ్యూరీని కలిపి రెండు మూడు నిమిషాలు ఉడికించాలి. ఒకవేళ బాగా చిక్కపడితే కాస్త నీళ్లు వేసి మరిగించాలి. పైన పనీరు లేదా వెన్న తుమురును వేసి సర్వ్‌చేయవచ్చు.

చిక్కుడుకాయ రసంనూడుల్స్‌ సూప్‌ ఉల్లిపాయ సూప్బెండకాయ సూప్‌గుమ్మడికాయ సూప్బీరకాయ సూప్‌సొరకాయ సూప్‌పెస్టో పాస్తా సలాడ్‌ఓట్స్‌- క్యాప్సికమ్‌ సూప్‌చింతపండు చారు
Advertisement