Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘కరోనా’ తగ్గింది... నియామకాలు పుంజుకుంటున్నాయి...

హైదరాబాద్ : కరోనా కారణంగా భారీగా పడిపోయిన నియామకాలు క్రమంగా పుంజుకుంటున్నాయి. భారత్ నియామక రేటు ఏప్రిల్ నెలలో 10 శాతం కాగా, మే లో మరో 3 శాతానికి పెరిగింది. కరోనా సెకండ్ వేవ్ అనంతరం ప్రొఫెషనల్స్ ఆర్థిక అనిశ్చితికి గురవుతున్నారని లింక్డిన్ డేటా వెల్లడిస్తోంది. భారత్ హైరింగ్ రేటు ఈ ఏడాది మార్చి నెలలో 50 శాతముండగా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఏప్రిల్ నాటికి ఇది ఏకంగా 10 శాతానికి పడిపోవడం గమనార్హం. 


నియామక రేటు పెరుగుతున్నప్పటికీ...

నియామక రేటు పెరుగుతున్నప్పటికీ వర్కింగ్ వుమెన్, యంగ్ ప్రొఫెషనల్స్ ఆర్థికంగా ఆందోళనకు గురవుతున్నట్లు లింక్డిన్ పేర్కొంది. ఈ డేటా ప్రకారం వర్కింగ్ మెన్ కంటే వర్కింగ్ వుమెన్ నాలుగు రెట్ల మేర తక్కువ విశ్వాసంతో ఉండడం గమనార్హం. అలాగే కొత్త గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలు పొందే సగటు సమయం రెండు నుండి మూడు నెలలకు పెరిగింది. మహిళా ఉద్యోగులు, యువ నిపుణులు ఇంకా తమ భవిష్యత్తుపై నిరాశావాదంతో ఉన్నారు.


ఈ నియామకాల్లో తగ్గుదల... 

లింక్డిన్ నివేదిక ప్రకారం... ఫైనాన్స్, కార్పొరేట్ సేవలు, తయారీ, ఆరోగ్య సంరక్షణ, హార్డ్‌వేర్, నెట్‌వర్కింగ్ రంగాల కంపెనీలు చురుగ్గా నియామకాలు చేపడుతున్నాయి. వినియోగ ఉత్పత్తులు, మీడియా, కమ్యూనికేషన్స్, ఆటోమోటివ్, మార్కెటింగ్, ప్రకటనలు రిక్రూటింగ్ కంపెనీల నియామకాలు క్షీణించాయి.


డిమాండ్ వీటికే...

దేశంలోని పది కంపెనీల్లో తొమ్మిది కంపెనీలు పదవులను  కలిపివేస్తున్నాయి. ప్రోడక్ట్ మేనేజ్‌మెంట్, కన్సల్టింగ్, ప్రోగ్రాం అండ్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ఇందులో ఉన్నాయి. గత క్యాలెండర్ ఏడాదిలో స్పెషలైజ్డ్ ఇంజినీరింగ్, కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ ఉద్యోగాలకు డిమాండ్ అనూహ్యంగా పెరిగిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 

TAGS: carona
Advertisement
Advertisement