Abn logo
Feb 21 2021 @ 08:52AM

కారును ఢీ కొట్టిన లారీ.. డివైడర్‌ ఎక్కిన కారు

హైదరాబాద్/హయత్‌నగర్‌ : వేగంగా వెళ్తున్న లారీ కారును ఢీ కొట్టడంతో కారు డివైడర్‌ ఎక్కిన సంఘటన హయత్‌నగర్‌ పోలీ‌స్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. శనివారం మధ్యాహ్నం నగరం నుం చి విజయవాడ వైపునకు వెళ్తున్న కారును హయత్‌నగర్‌ కుంట్లూర్‌ రోడ్డు చౌరస్తా వద్ద వెనుక నుంచి వేగంగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. దీంతో కారు జాతీయ రహదారిపైన ఉన్న డివైడర్‌ మధ్యలోకి ఎక్కి స్ర్టీట్‌ లైట్‌ పోల్‌ను ఢీ కొట్టింది. దీంతో కారు ముందు భాగం నుజునుజ్జయింది. కారు నడుపుతున్న వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. స్ర్టీట్‌ లైట్‌ పోల్‌ పూర్తిగా వంగింది. 

Advertisement
Advertisement
Advertisement