అమరావతి: సిటీ మున్సిపల్ కార్పొరేషన్‌పై ప్రజాభిప్రాయ సేకరణలో తొలిరోజున అధికారులకు రాజధాని రైతులు షాక్ ఇచ్చారు. ప్రభుత్వ ప్రతిపాదనను కురగల్లు గ్రామస్తులు ఏకగ్రీవంగా వ్యతిరేకించారు. తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని 19 గ్రామాలతో అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. దీనిని కురగల్లు గ్రామస్తులు ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కురగల్లు సభ తర్వాత నీరుకొండ గ్రామంలో అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ తీసుకున్నారు. అయితే రైతులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నామన్నారు.