పాఠశాలల ఫర్నిచర్‌ టెండర్లను రద్దు చేయండి

ABN , First Publish Date - 2022-05-18T17:17:46+05:30 IST

మన ఊరు-మన బడి పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఫర్నిచర్‌ కోసం ప్రకటించిన టెండర్లను రద్దుచేయాలని తెలంగాణ చిన్న, మధ్య తరహా పరిశ్రమల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ టెండర్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సంఘం ప్రతినిధులు..

పాఠశాలల ఫర్నిచర్‌ టెండర్లను రద్దు చేయండి

ప్రభుత్వానికి చిన్న తరహా పారిశ్రామికవేత్తల విజ్ఞప్తి 


హైదరాబాద్‌, మే 17(ఆంధ్రజ్యోతి): మన ఊరు-మన బడి పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాల(Public school)ల్లో ఫర్నిచర్‌ కోసం ప్రకటించిన టెండర్ల(tenders)ను రద్దుచేయాలని తెలంగాణ చిన్న, మధ్య తరహా పరిశ్రమల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ టెండర్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సంఘం ప్రతినిధులు ప్రభాకర్‌, కోటేశ్వరరావు, చంద్రబాబు, వెంకటరాజు మంగళవారం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సందీ్‌పకుమార్‌ సుల్తానియాను కలిశారు. టెండరులో పేర్కొన్న నిబంధనలు బడా కాంట్రాక్టర్ల కోసమే సిద్ధం చేసినట్టు తెలుస్తోందని అన్నారు. వెంటనే టెండర్లను రద్దు చేసి రాష్ట్రస్థాయిలో కాకుండా జిల్లా స్థాయిల్లో పిలవాలని కోరారు. ఇదే విషయంపై బుధవారం ఢిల్లీలో కేంద్ర ఎంఎ్‌సఎంఈ శాఖ మంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

Updated Date - 2022-05-18T17:17:46+05:30 IST