Advertisement
Advertisement
Abn logo
Advertisement

పిల్లలు పుట్టడం లేదని ఆస్పత్రికి వెళ్తే ఆ డాక్టర్ నీచమిది.. IVF పద్ధతిలో 200 మంది భర్తల వీర్యానికి బదులుగా..

ఎన్నారై డెస్క్: జీవనశైలిలో వచ్చిన మార్పుల కారణంగా చాలా మంది సహజ పద్ధతిలో పిల్లలను కనలేకపోతున్నారు. వైద్య రంగంలో అందించిన టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటూ.. అమ్మానాన్నలవుతున్నారు. ఈ క్రమంలోనే సహజ పద్ధతిలో తాము తల్లిదండ్రులం కాలేమని భావించిన కొందరు భార్యభర్తలు కృతిమ గర్భధారణ పద్ధతిని ఆశ్రయించారు. ఇలా అయినా అమ్మా.. నాన్న అని పిలుపించుకుందామని ఆశపడ్డారు. అయితే అలా వెళ్లిన దంపతులకు ఓ డాక్టర్ షాక్ ఇచ్చాడు. భార్యలను తల్లులనైతే చేశాడు కానీ వాళ్ల భర్తలను మాత్రం తండ్రులను చేయలేదు. మ్యాటర్ అర్థం కావడం లేదా.. అయితే ఫుల్ క్లారిటీ కోసం వార్త పూర్తిగా చదివేయండి.


భారత్‌లో వైద్యోనారాయణ హరిః అని వైద్యులను దేవుళ్లతో పోల్చుతాం. దాదాపు ఇలాంటి పద్ధతే ప్రపంచ వ్యాప్తంగా అమలవుతోంది. సమస్యలతో వెళ్లినప్పుడు వారికి ఉపశమనం కలిగిస్తే.. ఆ వైద్యులకు బాధితులు తమ గుండెళ్లో గుడి కట్టుకుంటారు. నలుగురికి సేవ చేస్తూ దేవుడనింపించుకునే వృత్తిని ఎంచుకుని కెనడాకు చెందిన నార్మన్ బార్విన్ అనే వైద్యుడు దారుణానికి పాల్పడ్డాడు. నమ్మి వచ్చిన బాధితులను నిలువునా మోసం చేశాడు. కెనడాలో ఓ మంచి ఫెర్టిలిటీ డాక్టర్ ఎవరు అంటే చాలా మంది నార్మన్ బార్విన్ పేరే చెబుతారు. కృత్రిమ గర్భధారణ ద్వారా దంపతులకు సంతాన భాగ్యం కల్గించడంలో ఈయనది అందెవేసిన చేయి. ఇందుకు గాను ఈయనకు ఓ ప్రతిష్టాత్మక అవార్డు కూడా వచ్చింది. అయితే గత నలభై ఏళ్లుగా నార్మన్ బార్విన్ చేస్తున్న మోసాలు తాజాగా బయటపడ్డాయి. 

నార్మన్ బార్విన్ (డాక్టర్ ఫైల్ ఫొటో)

ఐవీఎఫ్ పద్ధతిలో తల్లిదండ్రులయ్యేందుకు వెళ్లిన దంపతులను నార్మన్ బార్విన్ మోసం చేశాడు. సాధారణంగా ఐవీఎఫ్ పద్ధతిలో మహిళ నుంచి సేకరించిన అండానికి ఆమె భర్త వీర్యాన్ని జోడించి లాబరేటరీలో ఫలదీకరణం చెందిస్తారు. ఫలదీకరణ జరిగిన తర్వాత ఏర్పడ్డ పిండాలను తిరిగి మహిళ గర్భాశయంలో ప్రవేశపెడుతారు. అయితే నార్మన్ బార్విన్ అలా చేయలేదు. బాధితురాలి నుంచి సేకరించిన అండానికి.. తన స్పెర్మ్‌ను జోడించేవాడు. ఏర్పడ్డ పిండాన్ని బాధితురాలి గర్భాశయంలో ప్రవేశపెట్టేవాడు. కాగా.. నార్మన్ బార్విన్ వద్ద చికిత్స తీసుకుని.. ఓ పాపకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అనుమానం రావడంతో అసలు విషయం బయటపడింది. 


పాప పోలికల్లో తేడాలు ఉండటం.. ఆమె పెరిగొద్ది ఓ జన్యు సంబంధ వ్యాధితో బాధపడటం తల్లిదండ్రులకు ఆశ్చర్యం కలిగేలా చేసింది. ఈ క్రమంలోనే నార్మన్ బార్విన్ డీఎన్ఏని ఆ దంపతులు సంపాదించారు. పాప డీఎన్‌ఏతో అతని డీఎన్ఏ సరిపోలడంతో కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ విషయం కెనడాలో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో నార్మన్ బార్విన్ వద్ద చికిత్స తీసుకున్న మరికొందరు కూడా ఆ దంపతుల మార్గంలో నడిచారు. వారి విషయంలో కూడా అదే ఫలితం పునరావృతం కావడంతో సుమారు 200 మంది బాధితులు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై కోర్టు విచారణ జరుపుతుండగానే.. నార్మన్ బార్విన్ తన తప్పును అంగీకరించాడు. బాధితులకు పరిహారంగా రూ.80కోట్లను ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. అయితే ప్రతిపాదనకు ఇంకా కోర్టు ఆమోదముద్ర పడలేదు. 

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement