practical exam పేరిట రాత్రివేళ బాలికలను పాఠశాలకు పిలిచి...మత్తు మందు ఇచ్చి కీచక ఉపాధ్యాయుడు ఏం చేశాడంటే...

ABN , First Publish Date - 2021-12-07T15:59:08+05:30 IST

ప్రాక్టికల్స్ పరీక్షల పేరిట రాత్రివేళ 17మంది పదవ తరగతి చదువుతున్న బాలికలను పాఠశాలకు పిలచి, వారికి మత్తుమందు ఇచ్చి లైంగికంగా వేధించిన కీచక ఉపాధ్యాయుడి...

practical exam పేరిట రాత్రివేళ బాలికలను పాఠశాలకు పిలిచి...మత్తు మందు ఇచ్చి కీచక ఉపాధ్యాయుడు ఏం చేశాడంటే...

ముజఫర్‌నగర్ (ఉత్తరప్రదేశ్): ప్రాక్టికల్స్ పరీక్షల పేరిట రాత్రివేళ 17మంది పదవ తరగతి చదువుతున్న బాలికలను పాఠశాలకు పిలచి, వారికి మత్తుమందు ఇచ్చి లైంగికంగా వేధించిన కీచక ఉపాధ్యాయుడి బాగోతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌లో వెలుగుచూసింది. నవంబర్ 17వ తేదీ రాత్రి ముజఫర్‌నగర్‌లో 10వ తరగతి చదువుతున్న 17మంది బాలికలను కీచక ఉపాధ్యాయుడు సీబీఎస్‌ఈ ప్రాక్టికల్ పరీక్ష సాకుతో వారిని పాఠశాలకు పిలిచాడు.బాలికలకు మత్తుమందు కలిపిన ఆహారం పెట్టి వారిని ఉపాధ్యాయుడు లైంగికంగా వేధించాడు.మత్తులోకి జారుకున్న బాలికలు మరుసటిరోజు ఇంటికి తిరిగి వచ్చారు. ఏం జరిగిందో ఎవరికీ చెప్పవద్దని, చెబితే వారి కుటుంబ సభ్యులను చంపేస్తామని నిందితుడైన ఉపాధ్యాయుడు బాలికలను బెదిరించాడు. 



బాలికలు నిరుపేద కుటుంబాల నుంచి వచ్చారు. ఇద్దరు బాధిత బాలికల తల్లిదండ్రులు పుర్కాజి ఎమ్మెల్యే ప్రమోద్ ఉత్వాల్‌ను సంప్రదించడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది, ఎమ్మెల్యే చొరవతో బాధిత బాలికలు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అభిషేక్ యాదవ్‌ను సంప్రదించారు.  ఎస్పీ యాదవ్ జరిపిన దర్యాప్తులో ఆరోపణలు నిజమేనని తేలింది.ఈ కేసులో ఇద్దరు నిందితులైన ఉపాధ్యాయులపై పోలీసులు కేసు నమోదు చేసినా, వారిని ఇంకా అరెస్ట్ చేయలేదు. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పుర్కాజి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్‌పై శాఖాపరమైన విచారణ కూడా ప్రారంభించారు.


Updated Date - 2021-12-07T15:59:08+05:30 IST